STOCKS

News


ఆఫ్‌షోర్‌లో బలపడిన రూపాయి

Wednesday 17th April 2019
Markets_main1555496461.png-25191

క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో భారీగా నష్టపోయి 69.60 స్థాయికి పడిపోయిన రూపాయి బుధవారం ఆఫ్‌షోర్‌ మార్కెట్లో (విదేశాల్లో జరిగే ట్రేడింగ్‌) 25 పైసలు బలపడి రూ. 69.35 వద్దకు చేరింది. మహవీర్‌ జయంతి కారణంగా భారత్‌లో కరెన్సీ మార్కెట్లకు ఈ రోజు సెలవు దినమైనందున...గురువారం నాటి ట్రేడింగ్‌లో ఇక్కడ కూడా డాలరు మారకంలో రూపాయి విలువ పెరిగే అవకాశం వుంటుంది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో చైనా జీడీపీ విశ్లేషకుల అంచనాల్ని మించి 6.4 శాతం నమోదుకావడంతో పలు ఆసియా కరెన్సీలు పుంజుకున్న నేపథ్యంలో తాజాగా రూపాయి సైతం ఆఫ్‌షోర్‌ మార్కెట్లో బలోపేతం అయ్యింది.



You may be interested

మైండ్‌ ట్రీ నికర లాభం రూ.198.4

Wednesday 17th April 2019

ఐటీ రంగంలో సేవలు అందించే మధ్యస్థాయి కంపెనీ మైండ్‌ ట్రీ బుధవారం గత ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. క్యూ4లో  కంపెనీ నికరలాభం రూ.198.4 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే క్యూ4తో కంపెనీ ఆర్జించిన రూ.182.2 కోట్ల నికరలాభంతో పోలిస్తే ఇది 8.9శాతం అధికం. ఆదాయం సైతం 25.6 శాతం పెరిగి రూ.1,839.4 కోట్లకు చేరింది. గతేడాది క్యూ4లో ఆదాయం రూ.1,464 కోట్లుగా నమోదైంది. కంపెనీ వార్షిక ఆదాయం తొలిసారి

జెట్‌ఎయిర్‌వేస్‌ బిడ్డర్లు వీరే..!

Wednesday 17th April 2019

జెట్‌ ఎయిర్‌ను రుణ సంక్షోభ కష్టాల నుంచి గట్టిక్కేంచే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. దివాళా ప్రక్రియ చర్చల్లో భాగంగా కంపెనీ వాటాలను విక్రయించేందుకు ఎస్‌బీఐ మార్కెట్‌ క్యాపిటల్స్‌ నాలుగు బిడ్డర్లను ష్టార్‌ లిస్ట్‌ చేసినట్లు తెలిపింది. ఎతిహాత్‌ ఎయిర్‌లైన్స్‌తో పాటు టీపీజీ క్యాపిటల్‌, ఇండిగో పేరెంట్స్‌, ఎన్‌ఐఐఎఫ్‌లు షార్ట్‌లిస్టయిన బిడ్డర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. లిస్టింగ్‌లో చోటు దక్కించుకున్న ఈ నాలుగు కంపెనీలు ఏప్రిల్‌ 30 తేదీలోపు బిడ్ల‌ను సమర్పించాల్సి ఉంటుంది.

Most from this category