STOCKS

News


మూడురోజుల్లో 68పైసలు డౌన్‌

Wednesday 17th April 2019
Markets_main1555480351.png-25177

- మంగళవారం ముగింపు 69.60
ముంబై: ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ మంగళవారం వరుసగా మూడవ ట్రేడింగ్‌ సెషన్‌లోనూ తగ్గింది. సోమవారం ముగింపు (69.42)తో పోల్చితే 18పైసలు తగ్గి 69.60 వద్ద ముగిసింది. మూడురోజుల్లో రూపాయి 68 పైసలు నష్టపోయింది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్‌, అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరల పెరుగుదల వంటి అంశాలు రూపాయిపై ఈ మూడురోజుల్లో ప్రభావం చూపాయి.  ఈ వారంలో రెండు రోజులు సెలవు దినాలు (17వ తేదీ బుధవారం మహవీర్‌ జయంతి , 19వ తేదీ శుక్రవారం గుడ్‌ఫ్రైడే) కావడంతో అంతర్జాతీయంగా అప్రమత్తత పాటించడానికి వీలుగా ఫారెక్స్‌ ట్రేడర్ల నుంచి ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్లకోసం డిమాండ్‌ ఏర్పడింది. ఆయా అంశాల నేపథ్యంలో... రూపాయి మరింత బలహీనపడాల్సి ఉంది. అయితే దేశంలోకి భారీగా వస్తున్న విదేశీ నిధులు, దేశీయ ఈక్విటీల్లో భారీ కొనుగోళ్లు రూపాయి పతనాన్ని కొంతమేర కట్టడి చేస్తున్నాయి.  విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్‌ రిజర్వ్స్‌) వరుసగా రెండో వారంలోనూ (12వ తేదీతో ముగిసిన వారం) పెరగడం ఇక్కడ గమనార్హం. ఏప్రిల్‌ 5తో ముగిసిన వారంలో 1.87 బిలియన్‌ డాలర్ల పెరుగుదలతో 413.8 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. జీవితకాల గరిష్ట స్థాయిలను చేరుకునే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  గతేడాది ఏప్రిల్ 13న 426.028 బిలియన్‌ డాలర్లకు చేరి జీవితకాల గరిష్ట స్థాయిని నమోదుచేసిన సంగతి తెలిసిందే.  మంగళవారం మార్కెట్లో రూపాయి 69.66 వద్ద ప్రారంభమైంది. ఒకదశలో 69.69ని కూడా తాకింది. అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్‌ ధరలు అంతర్జాతీయంగా గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్‌ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి దాదాపు 20 డాలర్లకుపైగా పెరగడంతో అటు తర్వాత రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. రెండు నెలల క్రితం 72-70 మధ్య కదలాడింది. అయితే కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టేది మోదీనేనన్న అంచనాలు, స్థిరంగా దేశంలోకి వస్తున్న విదేశీ నిధులు, ఈ నేపథ్యంలో ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి గత రెండు నెలలుగా సానుకూలమవుతోంది.  ప్రస్తుతం 70-68 మధ్య స్థిరీకరణ పొందుతోంది. You may be interested

పాలీక్యాబ్‌ లిస్టింగ్‌ మెరుపులు

Wednesday 17th April 2019

-18 శాతం లాభంతో లిస్టింగ్‌  -22 శాతం లాభంతో ముగింపు న్యూఢిల్లీ: వైర్లు, కేబుళ్లు తయారు చేసే పాలీక్యాబ్‌ ఇండియా కంపెనీ స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించింది. బీఎస్‌ఈలో పాలీక్యాబ్‌ ఇండియా షేర్‌ ఇష్యూ ధర, రూ.538తో పోల్చితే 18 శాతం లాభంతో రూ.633 వద్ద లిస్ట్‌ అయింది. ఇంట్రాడేలో 23 శాతం లాభంతో రూ.668ను వద్ద గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 22 శాతం లాభంతో రూ.655 వద్ద ముగిసింది.

జెట్‌పై బ్యాంకుల కసరత్తు

Wednesday 17th April 2019

- త్వరలోనే మరిన్ని నిధులు సమకూర్చే అవకాశం - బిడ్డింగ్‌కు నరేష్ గోయల్‌ దూరం న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేట్ రంగ జెట్ ఎయిర్‌వేస్‌ను గట్టెక్కించడంపై బ్యాంకులు కసరత్తు కొనసాగిస్తున్నాయి. సంస్థను పునరుద్ధరించే దిశగా త్వరలోనే మరిన్ని నిధులు సమకూర్చే అవకాశాలపై చర్చలు జరుపుతున్నాయి. సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు ఈ విషయాలు వెల్లడించారు. జెట్ ఎయిర్‌వేస్‌పై దివాలా కోడ్ కింద చర్యలు తీసుకునేలా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్‌సీఎల్‌టీ) ఆశ్రయించేందుకు

Most from this category