STOCKS

News


రూపీ అప్‌..

Friday 9th November 2018
Markets_main1541739710.png-21805

క్రూడ్‌ ధరలు తగ్గడం, లిక్విడిటీకి మద్దతునిచ్చేందుకు ఆర్‌బీఐ ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా బాండ్లను కొనుగోలు చేయడం, బాండ్‌ ఈల్డ్స్‌ తగ్గడం వంటి అంశాల కారణంగా రూపాయి శుక్రవారం బలపడింది.
ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.67 వద్ద ట్రేడవుతోంది. రూపాయి మంగళవారం ముగింపు స్థాయి 73.01తో పోలిస్తే 0.46 శాతం లాభపడింది. ఇక రూపాయి శుక్రవారం 72.71 వద్ద ప్రారంభమైంది.
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.767 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు 7.799 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, ధరలు పరస్పరం వ్యతిరేక దిశల్లో ఉంటాయి.
క్రూడ్‌ ధరలు అక్టోబర్‌లో నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. అయితే ప్రస్తుతం క్రూడ్‌ ధర మూడు నెలల కనిష్ట స్థాయిలో ఉంది. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 71 డాలర్ల మార్క్‌ దిగువున ట్రేడవుతోంది. బ్రెంట్‌ క్రూడ్‌ ధర గత నెల రోజుల్లో దాదాపు 20 శాతం తగ్గింది.
క్రూడ్‌ ధరలు తగ్గడం, చైనా-అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం వంటి అంశాల వల్ల వర్ధమాన మార్కెట్లలో ఇన్వెస్ట్‌మెంట్‌ సెంటిమెంట్‌ మెరుగుపడిందని కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ పేర్కొంది. కాగా గత రాత్రి అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. డిసెంబర్‌లో వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చని సాంకేతాలిచ్చింది.
ఈ ఏడాది ఇప్పటి దాకా చూస్తే రూపాయి 12.5 శాతం క్షీణించింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి 5.65 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు.



You may be interested

టెస్లా చైర్‌పర్సన్‌గా రాబిన్‌ డెన్‌హోమ్‌

Friday 9th November 2018

వాహింగ్టన్‌: ఎలక్ట్రిక్‌ కార్ల సంచలనం టెస్లా... తన కొత్త చైర్‌పర్సన్‌గా రాబిన్‌ డెన్‌హోమ్‌(55)ను నియమించింది. కొన్నాళ్లుగా టెస్లా బోర్డులో ఇండిపెండెంట్‌ డైరెక్టరుగా వ్యవహరిస్తున్న రాబిన్‌ డెన్‌హోమ్‌... ఆస్ట్రేలియాకు చెందిన అతి పెద్ద టెలికం కంపెనీ, టెల్‌స్ట్రాకు చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆమె నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని టెస్లా తెలిపింది. పబ్లిక్‌ హోల్డింగ్‌ కంపెనీగా అమెరికా స్టాక్‌ మార్కెట్లలో లిస్టయిన టెస్లాను ప్రైవేటు కంపెనీగా మారుస్తానని, ఇన్వెస్టర్లకు

ఫెడ్‌ రేట్లు యథాతథం..!

Friday 9th November 2018

గురువారం ముగిసిన ఫెడ్‌ రెండు రోజుల సమావేశం బెంచ్‌ మార్క్‌ వడ్డీ రేట్లు యథాతథం డిసెంబర్‌లో పెంపు దిశగా నిర్ణయాలు.. కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు లేకుండా అమెరికా ఫెడ్‌ రెండు రోజుల సమవేశాన్ని ముగించింది. ఫెడరల్‌ ఫండ్స్‌ రేటును 2-2.25 శాతం శ్రేణిలో యథాతథంగా కొనసాగించేందుకు ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) ఏకగ్రీవ అంగీకారం తెలిపింది. అయితే డిసెంబర్‌ సమావేశంలో పావుశాతం పెంపు వుండవచ్చన్న సంకేతాలు ఇచ్చింది. అమెరికా ఆర్థిక

Most from this category