బలపడిన రూపాయి..
By Sakshi

ఇండియన్ రూపాయి శుక్రవారం లాభపడింది. ఆసియా కరెన్సీలు బలపడటం సానుకూల ప్రభావం చూపింది. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.77 వద్ద ట్రేడవుతోంది. గురువారం ముగింపు 74.13తో పోలిస్తే 0.47 శాతం లాభపడింది. రూపాయి శుక్రవారం 73.80 వద్ద ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం వినియోగదారు ఆధారిత ద్రవ్యోల్బణం, ఐఐపీ (పారిశ్రామికోత్పత్తి) గణాంకాలను వెల్లడించనుంది.
భారత్‌లో పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 7.986 శాతంగా ఉన్నాయి. బాండ్ ఈల్డ్స్ మునపటి ముగింపు 8.031 శాతంగా ఉంది. బాండ్ ఈల్డ్స్, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
ప్రస్తుత ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 13.8 శాతంమేర క్షీణించింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి 3.84 బిలియన్ డాలర్లను, డెట్ మార్కెట్ నుంచి 7.92 బిలియన్ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. బెంచ్‌మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ ఈ ఏడాది మొత్తంగా 0.4 శాతంమేర లాభపడింది.
అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాలకు దిగువునే ఉండటం సహా వాణిజ్య ఉద్రిక్తతల పరిష్కారం కోసం చైనా ప్రెసిడెంట్‌తో భేటీకి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం కారణంగా ఆసియా ప్రధాన కరెన్సీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. దక్షిణ కొరియా ఒన్ 0.87 శాతం, తైవాన్ డాలర్ 0.62 శాతం, ఇండోనేసియా రుపియ 0.24 శాతం, ఫిలిప్పిన్స్ పెసో 0.19 శాతం, సింగపూర్ డాలర్ 0.17 శాతం, మలేసియా రింగిట్ 0.07 శాతం పెరిగాయి. అయితే చైనా ఆఫ్‌షోర్ 0.32 శాతం, చైనా రెన్మిన్బి 0.16 శాతం, జపాన్ యెన్ 0.12 శాతం తగ్గాయి.
ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్ ఇండెక్స్ తన మునపటి ముగింపు స్థాయి 95.017తో పోలిస్తే 0.02 శాతం క్షీణతతో 94.994 వద్ద ట్రేడవుతోంది.
You may be interested
ఉత్తరాఖండ్‌లో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్‌లు
Friday 12th October 2018హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్... ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో ఇటీవల ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా ఆ రాష్ట్రంలో 500 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ఒలెక్ట్రా ప్రవేశపెట్టనుంది. వీటికోసం కంపెనీ రూ.700 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సమక్షంలో ఉత్తరాఖండ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎండీ బ్రిజేష్ కుమార్ సంత్, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఈడీ నాగ సత్యం
టీసీఎస్ క్యూ2 ఫలితాలు భళా: షేరు డీలా..!
Friday 12th October 2018దేశీ సాఫ్ట్వేర్ అగ్రగామి సంస్థ టీసీఎస్ షేరుకు కంపెనీ మెరుగైన ఆర్థిక ఫలితాలు రుచించలేదు. ఫలితంగా శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే ఆ షేరు 2.75శాతం నష్టపోయింది. కంపెనీ గురువారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక(క్యూ2) ఫలితాలను ప్రకటించింది. ఆ క్యూ2తో కంపెనీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.7,901 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం 6,446 కోట్లతో పోలిస్తే 22.6 శాతం ఎగబాకింది. మొత్తం