STOCKS

News


ఆఫ్‌షోర్‌లో రూపీ క్షీణత

Saturday 15th September 2018
Markets_main1536986830.png-20266

ఆఫ్‌షోర్‌ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం రాత్రి 72.11 వద్ద ముగిసింది. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే సోమవారం రూపాయి నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది. 
డాలర్‌ మారకంలో పడుతూ వస్తున్న రూపాయి శుక్రవారం కొంత రికవరీ అయ్యింది. దేశీయంగా చూస్తే బుధవారం ముగింపుతో పోల్చితే (గురువారం ఫారెక్స్‌ మార్కెట్‌ సెలవు) 34 పైసలు బలపడి 71.84 వద్ద ముగిసింది. శుక్రవారం రూపాయి ఒక దశలో 71.53 స్థాయిని కూడా తాకింది. రూపాయి మంగళవారం ట్రేడింగ్‌లో ఆల్‌టైమ్‌ కనిష్టం 72.92 స్థాయిని చూసింది. అటు తర్వాత కొంత కోలుకుని చివరకు 72.69 వద్ద ముగిసింది. అయితే బుధవారం ట్రేడింగ్‌లో 51 పైసలు లాభపడి 72.18‍కి రికవరీ అయ్యింది. శుక్రవారమూ రికవరీ ధోరణినే కొనసాగించి, మరో 34 పైసలు లాభపడింది. దేశంలో అటు టోకు, ఇక రిటైల్‌ ద్రవ్యోల్బణం (ఆగస్టులో వరుసగా 3.69 శాతం, 4.53 శాతం) పరిస్థితి మెరుగ్గా ఉండడం, పారిశ్రామిక ఉత్పత్తి జూలైలో 6.6 శాతంగా నమోదుకావడం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపాయి. డాలర్‌ ఇండెక్స్‌ సైతం కీలక స్థాయి 95 దిగువకు పడిపోవడం కూడా రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచింది. 



You may be interested

సన్నీ వార్షిక ఎడిషన్ @ రూ.6.99 లక్షలు

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమేకర్‌ నిస్సాన్ మిడ్‌-సైజ్‌ సెడాన్‌ సన్నీ వార్షికోత్సవ ఎడిషన్‌ను శుక్రవారం మార్కెట్‌లో విడుదలచేసింది. కారు సాంకేతిక వ్యవస్థ మొత్తాన్ని అనుసందానించే నిస్సాన్‌ కనెక్ట్‌తో కలిపి మొత్తం 50 అధునాతన సాంకేతిక ఫీచర్లు ఈ స్పెషల్‌ ఎడిషన్‌లో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ వేరియంట్లలో విడుదలైన ఈ కారు ధర 6.99 లక్షలు. ‘విశాలమైన ఇంటీరియర్స్, స్మార్ట్‌ టెక్నాలజీ అప్‌డేట్స్‌ కలిగిన సన్నీ వార్షిక ఎడిషన్‌

ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ తగ్గింది..

Saturday 15th September 2018

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, విప్రో ఏడీఆర్‌లు తగ్గాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్‌, వేదాంత, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. వేదాంత ఏడీఆర్‌ ఎక్కువగా పెరిగితే, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ ఎక్కువగా తగ్గింది.  టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 1.15 శాతం క్షీణతతో 18.04 డాలర్లకు తగ్గింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 2.73

Most from this category