STOCKS

News


ఆఫ్‌షోర్‌లో రూపీ దిగువకు

Saturday 10th November 2018
Markets_main1541824642.png-21833

ఇండియన్‌ రూపాయి శుక్రవారం రాత్రి ఆఫ్‌షోర్‌ మార్కెట్‌లో బలహీనపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే దాదాపు 23 పైసలు మేర క్షీణించింది. 72.73 వద్ద ముగిసింది. ఒకానొక సమయంలో 72.91 స్థాయికి కూడా పతనమైంది. అంతర్జాతీయంగా బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు గణనీయంగా తగ్గుతుండటంతో దేశీయ కరెన్సీ కూడా కనిష్ట స్థాయిల నుంచి రికవరీ అవుతూ వస్తోంది. ఇవి రెండూ దేశ ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశాలు. మంగళవారం ముగింపుతో పోలిస్తే శుక్రవారం రూపాయి దేశీ మార్కెట్‌లో 50 పైసలు బలపడి 72.50 వద్ద ముగిసింది. కాగా రూపాయి మంగళవారం 73 వద్ద ముగిసింది. రూపాయి సోమవారం ఒకేరోజు 67 పైసలు పతనమై 73.12కు తగ్గింది. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే సోమవారం రూపాయి నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది. 
కాగా దీపావళి, బలిప్రతిపాద సందర్భంగా ఫారెక్స్‌ మార్కెట్‌కు రెండు రోజులు (బుధవారం, గురువారం) సెలవు. తిరిగి ట్రేడింగ్‌ శుక్రవారం ప్రారంభమైంది. 

   



You may be interested

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఏడీఆర్‌ డౌన్‌..

Saturday 10th November 2018

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ స్టాక్స్‌ ఏడీఆర్‌లు క్షీణించాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, విప్రో, వేదాంత స్టాక్స్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌ ఎక్కువగా పడిపోతే, వేదాంత ఏడీఆర్‌ ఎక్కువగా పెరిగింది.   టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 0.46 శాతం లాభంతో 13.11

అక్టోబర్‌లో రూ.7,900 కోట్ల ‘సిప్‌’

Friday 9th November 2018

సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) మరింత బలపడుతోంది. స్టాక్‌ మార్కెట్లలో అస్థిరతలు నెలకొన్న సమయాల్లోనూ సిప్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వస్తున్న పెట్టుబడులు ప్రతీ నెలా పెరుగుతుండడం ఇన్వెస్టర్లలో వచ్చిన మార్పును తెలియజేస్తోంది. గత నెలలో సిప్‌ రూపంలో వచ్చిన పెట్టుబడులు రూ.7,900 కోట్లకు చేరాయి. గత ఏడాది అక్టోబర్‌లో సిప్‌ ద్వారా వచ్చిన నిధులతో పోలిస్తే 42 శాతం అధికం. ఇక, ఈ ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన రూ.7,727

Most from this category