STOCKS

News


68.57కు రూపాయి రికవరీ

Thursday 12th July 2018
Markets_main1531411217.png-18263

ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి స్వల్పంగా కోలుకుంది. గురువారం ఫారెక్స్‌ మార్కెట్లో 20 పైసలు బలపడి 68.57కు చేరుకుంది. చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి పట్ల సెంటిమెంట్‌ మెరుగుపడింది. వారం వ్యవధిలో రూపాయికి ఇది గరిష్ట స్థాయి. నాలుగు చమురు ఎగుమతి టెర్మినళ్లను తిరిగి తెరుస్తున్నట్టు లిబియా చేసిన ప్రకటన చమురు ధరల పతనానికి దారితీసింది. దీంతో డాలర్‌ అంతర్జాతీయంగా బలంగా ఉన్నప్పటికీ, రూపాయి రికవరీకి తోడ్పడింది. ఇంట్రాడేలో 68.50 వరకు కోలుకోగా, చివరికి 68.57 వద్ద స్థిరపడింది. అటు, బ్రిటిష్‌ పౌండ్‌, యూరో, జపాన్‌ యెన్‌తోనూ రూపాయి బలపడింది. 



You may be interested

ఐడీబీఐ బ్యాంక్‌ అధికారుల సమ్మె!!

Thursday 12th July 2018

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లోని ఒక వర్గం అధికారులు సోమవారం నుంచి ఆరు రోజులపాటు (జూలై 16 నుంచి 21 వరకు) సమ్మె బాట పడతామని హెచ్చరించారు. ఎల్‌ఐసీకి వాటా విక్రయం, వేతన సంబంధిత అంశాలను దీనికి కారణంగా పేర్కొన్నారు. బ్యాంక్‌ ఒక వర్గం అధికారుల నుంచి సమ్మెకు సంబంధించి లేఖ అందిందని ఐడీబీఐ తాజాగా రెగ్యులేటరీకి తెలియజేసింది. కాగా ఐడీబీఐ బ్యాంక్‌ ఉద్యోగులకు వేతన సవరణ అంశం 2012 నవంబర్‌

రిటైల్‌ ధరలకు రెక్కలు!

Thursday 12th July 2018

న్యూఢిల్లీ: జూన్‌ నెలలో రిటైల్‌ ధరల ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం మరోసారి 5 శాతం మార్కును నమోదు చేసింది. ఈ ఏడాది జనవరిలో 5.07 శాతంగా నమోదైన తర్వాత రిటైల్‌ ద్రవ్యోల్బణం తిరిగి మరోసారి గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆహారోత్పత్తుల విభాగంలో ధరలు కాస్తంత ఉపశమించినా, చమురు ధరలు పెరిగిపోయే సరికి ఆ ప్రభావం రిటైల్‌ ద్రవ్యోల్బణంపై ప్రతిఫలించింది. దీంతో 5 శాతానికి పెరిగింది. ఇది మే నెలలో 4.87

Most from this category