STOCKS

News


టాప్‌ 100 శక్తివంత మహిళల్లో మనవాళ్లు నలుగురు

Friday 7th December 2018
news_main1544161541.png-22722

న్యూయార్క్‌: ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ రూపొందిందిన ఈ ఏడాది అగ్రశ్రేణి వంద అత్యంత శక్తివంతమైన మహిళల్లో మన దేశానికి చెందిన నలుగురు మహిళలకు చోటు దక్కింది. హెచ్‌సీఎల్‌ ఎంటర్‌ప్రైజ్‌ రోష్ని నాడార్‌ మల్హోత్ర, బయోకాన్‌ కిరణ్‌ మజుందార్‌ షా, హిందుస్థాన్‌ టైమ్స్‌ శోభన భర్తియ, ప్రముఖ సినీతార ప్రియాంక చోప్రా ఈ జాబితాలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 మందితో రూపొందించిన ఈ జాబితాలో అగ్రస్థానంలో జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కల్‌ నిలిచారు. ఆమె ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలవడం ఇది వరుసగా ఎనిమిదో సంవత్సరం.  రెండో స్థానంలో యూకే ప్రధాని థెరిస్సా మే, మూడో స్థానంలో ఐఎమ్‌ఎఫ్‌ ఎమ్‌డీ క్రిస్టినా లగార్డే ఉన్నారు. 
51వ స్థానంలో రోష్ని నాడార్‌...
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌కు సీఈఓగా వ్యవహరిస్తున్న నాడార్‌ మల్హోత్ర 51వ స్థానంలో నిలిచారు. ఇక బయోకాన్‌కు చెందిన కిరణ్‌ మజుందార్‌ షా 60వ స్థానంలో నిలవగా, హెచ్‌టీ మీడియా సీఎండీ శోభనా భర్తియ 88వ స్థానంలో నిలిచారు. ఇటీవలే అమెరికా గాయకుడు నిక్‌ జోనాస్‌ను వివాహం చేసుకున్న ప్రియాంక చోప్రా 94వ స్థానంలో నిలిచారు. 



You may be interested

ఆర్‌ఈసీలో వాటాల విక్రయానికి ఓకే

Friday 7th December 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలో మరిన్ని సంస్థల విలీనాలకు తెరతీస్తూ ఆర్ఈసీలో వాటాల విక్రయ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు (పీఎఫ్‌సీ) మొత్తం 52.63 శాతం వాటాలను విక్రయించనుంది. గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. ఈ డీల్‌ ద్వారా ఖజానాకు సుమారు రూ.15,000 కోట్లు దఖలు పడనున్నాయి. వాస్తవానికి ఆర్‌ఈసీకే పీఎఫ్‌సీలో వాటాలను విక్రయించాలని ముందుగా

ముత్తూట్‌ ఫైనాన్స్‌ నికర లాభం రూ.483 కోట్లు

Friday 7th December 2018

న్యూఢిల్లీ: ముత్తూట్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.484 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.446 కోట్ల నికర లాభం సాధించామని, 9 శాతం వృద్ధి సాధించామని ముత్తూట్‌ ఫైనాన్స్‌ కంపెనీ తెలిపింది. గత క్యూ2లో రూ.1,662 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.1,650 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ముత్తూట్‌

Most from this category