STOCKS

News


హోల్డ్‌ అబాట్‌ ఇండియా: సెంట్రమ్‌

Saturday 13th October 2018
Markets_main1539418991.png-21133

అధిక వాల్యూవేషన్స్‌ కలిగి వున్నప్పటికీ, అబాట్ ఇండియా షేరును ‘‘హోల్డ్‌’’ చేయవచ్చని ప్రముఖ రేటింగ్‌ సంస్థ సెంట్రమ్‌ బ్రోకింగ్‌ అంటుంది. ఔష‌ధ త‌యారీ రంగంలో తనదైన ముద్ర చేసుకున్న అబాట్ ఇండియా కంపెనీ షేరుపై సెంట్రమ్‌ బ్రోకింగ్‌ సంస్థ విశ్లేషణనలు ఇలా ఉన్నాయి...
ప్రస్తుత షేరు ధర:- రూ.7,162
టార్గెట్‌ ధర:- రూ.7,250
రేటింగ్‌:- హోల్డ్‌
షేరుపై ఆదాయం:- 1.2శాతం
విశ్లేషణ:- అమెరికాకు చెందిన అబాట్‌ లేబొరేటరీస్‌ అనుంబంధ కంపెనీ ఇది. కంపెనీ పోర్టు ఫోలియోలో దాదాపు 110 బ్రాండ్లు ఉన్నాయి. కొత్త ఔషధాల ఉత్పత్తులు కంపెనీ మార్జిన్లులను పెంచుతాయి. వ్యాక్సిన్‌(సూదిమందు) తయారీ విభాగంలో కంపెనీ ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తుంది. అబాట్‌ ఇండియా దేశంలో చికిత్సా విభాగంలో 80శాతం సేవలను అందిస్తోంది. కంపెనీకి చెందిన 10 బ్రాండ్లు ఏటా 72 శాతం ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి. కంపెనీ ప్రధాన ఉత్పత్తి థైరాయిడ్‌ ఔషధమైన ‘‘థైరోనార్మ్‌’’కు మార్కెట్లో 52 శాతం వాటాను కలిగి ఉంది. నోవో నార్డిస్క్‌ ఇన్సులిన్‌ ఉత్పత్తులను దేశీ మార్కెట్లో మార్కెటింగ్‌ చేస్తోంది. వ్యాక్సిన్లను మార్కెట్‌ చేయటానికి భారత్‌ బయోటెక్‌తో కూడా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
బలమైన మార్కెటింగ్‌ వ్యవస్థ:- అబాట్ ఇండియా కంపెనీ బలమైన మార్కెటింగ్‌ నెట్‌వర్కింగ్‌ కలిగి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీలో 3,000 మంది మెడికల్‌ రిప్రజెంటివ్స్‌ ఎంపిక చేసుకుంది. మెట్రో, టైర్‌-1 సిటిల్లో కంపెనీకి 90-95శాతం మెడికల్‌ రిప్రజెంటివ్స్‌ ఉన్నారు. కంపెనీ తన మొత్తం ఆదాయంలో 80-85శాతం మెట్రో, టైర్‌-1 సిటిల నుంచి ఆర్జిస్తోంది. జీఎస్‌టీ అమలు తరువాత కంపెనీ మరిన్ని లాభాల్ని అర్జిస్తోంది.
ప్రతికూలాంశాలు:- కంపెనీ ఉత్పత్తి చేసిన ప్రధాన బాండ్లు ఫార్మా మార్కెట్లో తర్వగా పేరు తెచ్చకోవడంపై బ్రోకరేజ్‌ సంస్త అనుమానం వ్యక్తం చేస్తుంది. అలాగే దేశీయ మార్కెట్‌ నెమ్మదించడం, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ఒడిదుడుకుల ట్రేడింగ్‌ షేరుపై ప్రభావాన్ని చూపవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ అంటుంది.

(అబాట్‌ ఇండియా కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌లపై క్లిక్‌ చేయండి..)

View Pdf One (1539419088Abbott India - Management Meet Update - Centrum 10102018.pdf)
View Pdf Two (803895671Abbott India - Management Meet Update - Centrum 10102018.pdf)

You may be interested

టెల్కోల ఎర్నింగ్స్‌ ఎలా ఉండొచ్చు?

Saturday 13th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజా నివేదిక ప్రకారం టెలికం, మీడియా కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు క్యూ2 ఆర్థిక ఫలితాలు ఎలా ఉండవచ్చొ ఒకసారి చూద్దాం.. కంపెనీ            క్యూ2 ఎర్నిం‍గ్స్‌ అంచనా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌    సూపర్‌గా ఉండొచ్చు డిష్‌ టీవీ వీడియోకాన్‌    యావరేజ్‌ ఈఎన్‌ఐఎల్‌        సూపర్‌గా ఉండొచ్చు మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌    యావరేజ్‌ భారతీ ఎయిర్‌టెల్‌    బలహీనంగా ఉండొచ్చు వొడాఫోన్‌ ఐడియా    బలహీనంగా ఉండొచ్చు భారతీ ఇన్‌ఫ్రాటెల్‌        బలహీనంగా ఉండొచ్చు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌,.....

ఫార్మా క్యూ2 ఫలితాలు బాగుంటాయా?

Saturday 13th October 2018

ఇండియన్‌ ఫార్మా కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్‌)లో మంచి ఫలితాలను ప్రకటించవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. రూపాయి క్షీణత, అమెరికా వ్యాపారం నిలకడగా ఉండటం, యూఎస్‌ఎఫ్‌డీఏ సమస్యలు పరిష్కారమవ్వడం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపనున్నాయని పేర్కొంది. సన్‌ ఫార్మా, లుపిన్‌, ఆల్‌కెమ్‌, డిష్‌మాన్‌ షేర్లను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. కంపెనీలు ఎలాంటి ఫలితాలు ప్రకటించనున్నాయో ఒకసారి చూద్దాం..  కంపెనీలు  

Most from this category