STOCKS

News


డాక్డర్‌ రెడ్డీస్‌ దువ్వాడ ప్లాంట్‌పై నీలినీడలు..

Saturday 10th November 2018
Markets_main1541846128.png-21872

  • నాలుగేళ్లలో ఒకే ప్లాంట్‌కు మూడు సార్లు అభ్యంతరాలు
  • నూతన అనుమతులపై దువ్వాడ ప్లాంట్‌ ప్రభావం

దేశీ ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యుఎస్‌ ఎఫ్‌డీఏ) నుంచి వరుస అభ్యంతరాలు అందుతూనే ఉన్నాయి. అమ్మకాల పరంగా ఐదవ అతి పెద్ద కంపెనీగా ఉన్నటువంటి ఈ సంస్థకు చెందిన దువ్వాడ ప్లాంట్‌కు తాజాగా మరోసారి ఫారమ్‌ 483 జారీ అయినట్లు ఒక ఆంగ్ల పత్రిక వెల్లడించింది. ఈ పత్రిక కథనం ప్రకారం.. విశాఖపట్నం సమీపంలోని దువ్వాడ ప్రాంతానికి చెందిన ఈ సంస్థ ప్లాంట్‌లో ఎఫ్‌డీఏ వరుసగా అభ్యంతరాలను తెలుపుతూనే ఉంది. ఏకంగా మూడవసారి ఈ విధంగా దువ్వాడ ప్లాంట్‌ అభ్యంతరాలను అందుకున్నట్లు వెల్లడించింది. సంస్థకు కీలకంగా ఉన్నటువంటి ఈ ప్లాంట్‌లో డాకోజెన్, విదజా జనరిక్స్‌ ఉత్పత్తి అవుతున్నాయి. నిజానికి కంపెనీ మొత్తం అమ్మకాలలో ఈ ప్లాంట్‌ వాటా 10 శాతానికి లోపుగానే ఉన్పప్పటికీ.. మళ్లీ మళ్లీ అభ్యంతరాలను అందుకుంటుండం వల్ల సంస్థ భవిష్యత్‌ అనుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఈ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ ఏడాది అక్టోబర్‌ 23న మొదలైన తనిఖీల అనంతరం.. ఎఫ్‌డీఏ తాజాగా ఈసారి మొత్తం ఎనిమిది అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు వెల్లడించింది. వీటిలో ఐదు 2017లో ఇచ్చినవే కాగా, మూడు 2015లో ఇచ్చిన లేఖలుగా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కంపెనీ షేరు ధర రూ.53 (2.16 శాతం) పతనమై రూ.2,400 వద్ద ముగిసినట్లు వివరించింది. ఫార్మా ఇండెక్స్‌ 1.3 శాతం పెరిగినప్పటికీ ఈ షేరు నష్టాల్లో ముగిసింది.

దువ్వాడ ప్లాంట్‌కు గతంలో అందిన అభ్యంతరాలు
నవంబర్ 2015: మూడు పరిశీలనలతో యుఎస్‌ ఎఫ్‌డీఏ హెచ్చరిక జారీచేసింది.
ఫిబ్రవరి 2017: ప్లాంట్‌ను ఎఫ్‌డీఏ పునఃపరిశీలన చేసింది.
మార్చి 2017: ఏకంగా 13 అభ్యంతరాలతో కూడిన ఫారమ్‌ 483ను జారీ చేసింది.
అక్టోబరు 2018: మరోసారి పరిశీలించిన ఎఫ్‌డీఏ ఎనిమిది అభ్యంతరాలను తెలిపింది. 



You may be interested

ఈ దశలో ఇన్వెస్టర్ల ముందున్న మార్గాలు?

Sunday 11th November 2018

రెండు వరుస నెలల పతనం తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్లు ప్రస్తుతం విరామం తీసుకుని తదుపరి డైరెక్షన్‌ కోసం ఎదురు చూస్తున్నాయి. మరి మార్కెట్ల పతనం ముగిసిందా? లేక మరికొంత కాలం ఆగిపోవాలా..? ఈ విషయాలు కొత్త ఇన్వెస్టర్లకు తెలియడం కొంచెం కష్టమైన పనే. ఈ విషయంలో ఇన్వెస్టర్లు అనుసరించతగిన వ్యూహాలను కోటక్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ తెలియజేశారు.    తాజా మార్కెట్‌ ర్యాలీలో బలహీనమైన దీర్ఘకాలిక

ఈ స్టాక్స్‌పై కోటక్‌ బుల్లిష్‌

Saturday 10th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా పలు స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. అవేంటో ఒకసారి చూద్దాం.. స్టాక్‌: అర్వింద్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.319 టార్గెట్‌ ప్రైస్‌: రూ.452 అర్వింద్‌ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్‌)లో అంచనాలకు అనుగుణమైన ఫలితాలనే ప్రకటించింది. కన్సాలిడేట్‌ నికర అమ్మకాల్లో వార్షికంగా 11.6 శాతం వృద్ధి నమోదయ్యింది. టెక్స్‌టైల్‌ విభాగంలో 6 శాతం, మెటీరియల్స్‌ విభాగంలో 21 శాతం, బ్రాండెడ్‌ అప్పరెల్‌ విభాగంలో

Most from this category