STOCKS

News


విమానంలో కనెక్టివిటీ కోసం జియో దరఖాస్తు

Wednesday 17th April 2019
news_main1555479257.png-25173

న్యూఢిల్లీ: ప్రయాణ సమయంలో విమానం లోపల కనెక్టివిటీ, డేటా సేవలందించేందుకు తమకు అనుమతివ్వాలని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ టెలికాం విభాగానికి దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఓర్టస్ కమ్యూనికేషన్స్, స్టేషన్ శాట్‌కామ్‌, క్లౌడ్ కాస్ట్ డిజిటల్ సంస్థలు ఇప్పటికే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్కు (డాట్‌) ఈ సౌకర్యం కోసం దరఖాస్తులు సమర్చించాయి. ఈ సేవలు అందించడానికి లైసెన్స్‌ తప్పనిసరి చేస్తూ గతేడాది డాట్‌ నిర్ణయం తీసుకోగా.. హ్యూస్‌ కమ్యూనికేషన్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్‌) ఫిబ్రవరిలో ఈ తరహా లైసెన్స్‌ పొంది... దేశంలో తొలి సంస్థగా నిలిచింది. ఆ తరవాత నెల్కోకు చెందిన అనుబంధ సంస్థ టాటానెట్‌ సర్వీసెస్‌కు కూడా ఇన్‌-ఫ్లయిట్‌, మారిటైమ్‌ కమ్యూనికేషన్స్‌ లైసెన్స్‌ దక్కింది. ఇటీవలే భారతీ ఎయిర్‌టెల్‌కు పూర్తి అనుబంధ సంస్థగా ఉన్న టెలీపోర్ట్స్‌ లిమిటెడ్‌ కూడా ఈ లైసెన్స్‌ దక్కించుకుంది.



You may be interested

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఖాతాలు ఎన్‌పీఏలే!!

Wednesday 17th April 2019

ఎన్‌సీఎల్‌ఏటీకి తెలిపిన ఆర్‌బీఐ న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు కంపెనీల ఖాతాలను నిబంధనల మేరకు ఎన్‌పీఏలుగా వర్గీకరించాల్సి ఉంటుందని జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ముందు ఆర్‌బీఐ వాదించింది. రుణ చెల్లింపుల్లో విఫలమైన 90 రోజుల తర్వాత ఏ ఖాతానయినా సరే ఎన్‌పీఏగా వర్గీకరించాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని స్పష్టం చేసింది. ప్రతీ బ్యాంకు ఇదే విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందని, ఈ విషయంలో మినహాయింపు

ఇక నుంచి కొత్త ఫామ్‌-16

Wednesday 17th April 2019

మరింత సమాచారం ఉండేలా మార్పులు న్యూఢిల్లీ: యాజమాన్యాలు ఉద్యోగుల టీడీఎస్‌ (మూలం వద్ద పన్ను కోత) వివరాలకు సంబంధించి జారీచేసే ఫామ్‌ -16 సర్టిఫికేట్‌ ఫార్మాట్‌ను ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ సవరించింది. హౌస్‌ ప్రాపర్టీ నుంచి ఆదాయాలు, ఇతర యాజమాన్యాల నుంచి పారితోషికాలు సహా విస్తృత ప్రాతిపదికన సమాచారం అందుబాటులో ఉండేలా ఫామ్‌-16ను సవరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పన్ను ఎగవేతల నిరోధమే లక్ష్యంగా సమగ్రంగా ఈ ఫార్మాట్‌ను రూపొందించినట్లు

Most from this category