STOCKS

News


ఎన్‌బీఎఫ్‌సీ పరిధిలోకి గృహ రుణ కంపెనీలు

Wednesday 14th August 2019
news_main1565761112.png-27755

  • ఇక వీటిపై ఆర్‌బీఐ నియంత్రణలు
  • ఎన్‌బీఎఫ్‌సీ పరిధిలోకి గృహ రుణ కంపెనీ

గృహ రుణ కంపెనీలు (హౌసింగ్‌ ఫైనాన్స్‌) ఇక బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌ల) పరిధిలోకి రానున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తాజా నిర్ణయం వల్ల ఇకపై హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు ఆర్‌బీఐ ప్రత్యక్ష నియంత్రణలోకి రానున్నాయి. నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ యాక్ట్‌, 1987 సరవణ ప్రకారం, తాజా పరిణామం చోటుచేసుకుంటున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. కేంద్ర నోటిఫికేషన్‌ అనంతరం ఆర్‌బీఐ తాజా ప్రకటన జారీ చేసింది. హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు రెగ్యులేటర్‌గా నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ) కొనసాగబోదని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌  2019-2020 బడ్జెట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘‘రెగ్యులేటరీ విధానం దృష్ట్యా, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీల్లో ఒక విభాగంగా హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలను పరిగణించడం జరుగుతుంది. త్వరలో ఆర్‌బీఐ ఈ అంశంపై ఒక సమీక్ష నిర్వహించి నియంత్రణలకు సంబంధించి తగిన నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుంది’’ అని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అప్పటి వరకూ మాత్రం నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ జారీచేసే ఆదేశాలు, ఉత్తర్వులకు లోపబడి హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు పనిచేస్తాయని ఆర్‌బీఐ ప్రకటన పేర్కొంది. 

ఎన్‌బీఎఫ్‌సీలకు మరింత ద్రవ్యలభ్యత
కాగా, ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్‌ కంపెనీలకు ఊరట కల్పించే ఒక బడ్జెట్‌ నిర్ణయాన్ని కేంద్రం నోటిఫై చేసింది. దీనిప్రకారం... ఫైనాన్షియల్‌గా పటిష్టంగా ఉన్న ఎన్‌బీఎఫ్‌సీ నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇకపై అధిక రేటింగ్‌ ఉన్న అసెట్‌ను ఏదైనా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. లక్ష కోట్ల పరిమితి పరిమితి వరకూ ఈ కొనుగోళ్లు జరిపే వీలుంటింది. ఈ కొనుగోళ్లకు సంబంధించి పాక్షిక రుణ గ్యారెంటీని కేంద్రం బ్యాంకులకు కల్పిస్తుంది. సంబంధిత స్కీమ్‌ను మంగళవారం ఆర్థికశాఖ నోటిఫై చేసింది. ఎన్‌బీఎఫ్‌సీలకు ద్రవ్యలభ్యత పెరగడం వల్ల లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, రిటైల్‌, హౌసింగ్‌ వంటి ఉత్పాదక రంగాలకు మరింత రుణ సౌలభ్యం కలుగుతుంది.



You may be interested

కోల్‌ ఇండియా లాభం రూ.4,630 కోట్లు

Wednesday 14th August 2019

రూ.26,089 కోట్లకు మొత్తం ఆదాయం  ఈ క్యూ1లో 137 మిలయన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మైనింగ్‌ దిగ్గజం, కోల్‌ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.4,630 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత క్యూ1లో రూ.3,786 కోట్ల నికర లాభం ఆర్జించామని కోల్‌ ఇండియా తెలిపింది. ఆదాయం అధికంగా రావడంతో ఈ క్యూ1లో నికర లాభం బాగా పెరిగిందని పేర్కొంది. గత క్యూ1లో రూ.25,359

అదుపులోనే రిటైల్‌ ధరల స్పీడ్‌

Wednesday 14th August 2019

జూలైలో 3.15 శాతం ఆర్‌బీఐ నిర్దేశిత స్థాయిలోనే కట్టడి న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం జూలైలో 3.15 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జూలైతో పోల్చితే 2019 జూలైలో వినియోగ ధరల సూచీలో పేర్కొన్న వస్తువులు, ఉత్పత్తుల బాస్కెట్‌ ధర మొత్తం కేవలం 3.15 శాతమే పెరిగిందన్నమాట. ఇది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశిత స్థాయిలోనే రిటైల్‌ ద్రవ్యో‍ల్బణం కొనసాగుతుండడం గమనార్హం. 2 శాతానికి ప్లస్‌

Most from this category