News


వరుసగా మూడవదఫా రేటు కోత

Tuesday 16th April 2019
news_main1555393323.png-25157

బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా- మెరిల్‌ లించ్‌ అంచనా...
వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం రిజర్వ్‌ బ్యాం‍క్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశించిన 4 శాతంలోపే కొనసాగుతున్నందువల్ల వరుసగా మూడవసారి కూడా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- రెపో ప్రస్తుతం 6 శాతం) తగ్గే అవకాశం ఉందని ఫారిన్‌ బ్రోకరేజ్‌ సంస్థ- బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా- మెరిలించ్‌ (బీఓఎఫ్‌ఏ-ఎంఎల్‌) అంచనా వేసింది.  ‘‘జూన్‌ 3 నుంచి 6వ తేదీ వరకూ జరిగే  పాలసీ సమీక్ష సందర్భంగా మరోపావుశాతం రేటు కోత ఉంటుందని భావిస్తున్నాం’’ అని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదే జరిగితే రెపో 5.75 శాతానికి దిగివస్తుంది. ఆరు నెలల్లో 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించినట్లవుతుంది. పారిశ్రామిక వృద్ధి రేటు ఆందోళనకర స్థాయిలో పడిపోవడం (ఫిబ్రవరిలో 20 నెలల కనిష్ట స్థాయి 0.1 శాతం), రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశిత 4 శాతం దిగువనే (మార్చిలో  2.86 శాతం) ఉండడం వంటి అంశాలు ఆర్‌బీఐ మరోదఫా రేటు కోత అంచనాలకు ఊతం ఇస్తోంది. ఈ ఏడాది ‘‘దాదాపు సాధారణ’’ వర్షపాతం నమోదవుతుందని సోమవారం భారత వాతావరణ శాఖ పేర్కొనడం తాజా విశేషం. ఇది ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచే అంశం. 



You may be interested

దేశీయంగా ఐవోసీ ట్రేడింగ్ డెస్క్‌

Tuesday 16th April 2019

స్పాట్‌ మార్కెట్లో ముడి చమురు కొనుగోలుకు ఏర్పాట్లు న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి రియల్‌ టైమ్ ప్రాతిపదికన ముడిచమురును కొనుగోలు చేసే దిశగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) దేశీయంగా ఢిల్లీలో ట్రేడింగ్ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. నాణ్యమైన ముఽడిచమురును మెరుగైన ధరకే దక్కించుకోవడం ద్వారా దిగుమతి వ్యయాలను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్‌) ఎ.కె.శర్మ తెలిపారు. ఐవోసీ ప్రస్తుతం తమ అవసరాల్లో 30 శాతాన్ని (15

ఎన్‌బీఎఫ్‌సీలకు సెక్యూరిటైజేషన్ దన్ను

Tuesday 16th April 2019

- 2018-19లో రూ.26,200 కోట్ల సమీకరణ - ఇక్రా నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: నిధుల లభ్యత కష్టంగా మారినప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో నాన్‌-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ), సూక్ష్మ రణాల సంస్థలు (ఎంఎఫ్‌ఐ) రుణాల పోర్ట్‌ఫోలియోను విక్రయించడం ద్వారా (సెక్యూరిటైజేషన్‌) దాదాపు రూ. 26,200 కోట్లు సమీకరించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ మార్గంలో సమీకరించిన నిధులతో పోలిస్తే ఇది 170 శాతం అధికం. 2017-18లో సెక్యూరిటైజేషన్ ద్వారా ఎన్‌బీఎఫ్‌సీ, ఎంఎఫ్‌ఐలు

Most from this category