STOCKS

News


ఆర్‌బీఐ, ప్రభుత్వం విభేదాలు పరిష్కరించుకోవాలి

Friday 9th November 2018
news_main1541740818.png-21811

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య పలు అంశాల్లో విభేదాలు పొడచూపిన నేపథ్యంలో జాతి ప్రయోజనాల కోసం ఇరువురు కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ పనగరియా చెప్పారు. ప్రభుత్వం, ఆర్‌బీఐ రెండూ రాజీ ధోరణితో విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. ‘‘అమెరికాలోని ఫెడరల్‌ రిజర్వ్‌తో పోలిస్తే భారత్‌లో ఆర్‌బీఐకి చట్టపరంగా తక్కువ స్వతంత్రత ఉంది. కానీ, ఆచరణలో ఫెడ్‌కు సమానమైన స్వతంత్రతను ఆర్‌బీఐ అనుభవిస్తోంది’’ అని పనగరియా చెప్పారు. ప్రభుత్వం, ఆర్‌బీఐ సన్నిహిత సహకారంతో కలసి పనిచేయాలన్నారు. రెండింటి మధ్య విభేదాలున్నా, తప్పనిసరిగా రాజీధోరణితో జాతి ప్రయోజనాల కోసం కలసి పనిచేయాలన్నారు. పనగరియా ప్రస్తుతం కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అమెరికాలోనూ ప్రభుత్వం, ఫెడరల్‌ రిజర్వ్‌ పలు సందర్భాల్లో కలసి పనిచేస్తాయని, 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత కూడా ఇది జరిగిందని పనగరియా తెలిపారు. ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య ఉమ్మడి వేదికను ప్రస్తావించడానికి బదులుగా మీడియా వాటి మధ్య విభేదాలను ఎత్తిచూపడాన్ని దురదృష్టకరంగా అభివర్ణించారు. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో లిక్విడిటీ సమస్య, ప్రభుత్వరంగ బ్యాంకుల నిర్వహణ, తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఆర్‌బీఐ ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించకపోతే చట్టంలోని సెక్షన్‌ 7ను ఉపయోగించాల్సిన అవసరం ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించడం గమనార్హం.



You may be interested

బ్యాంక్‌లకు భలే అవకాశం

Friday 9th November 2018

ముంబై: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) తాజా సంక్షోభం బ్యాంక్‌లకు మంచి అవకాశంగా మారనున్నట్లు సింగపూర్‌కు చెందిన డీబీఎస్‌ అంచనా వేసింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం రుణాల్లో 12-15 శాతం వాటా ఎన్‌బీఎఫ్‌సీలదేనని డీబీఎస్‌ ఆర్థిక వేత్త రాధిక రావు పేర్కొన్నారు. ‘‘ఇప్పుడు ఎన్‌బీఎఫ్‌సీలకు లిక్విడిటీ సమస్యలు తలెత్తడంతో ఈ వాటా రుణాలు బ్యాంక్‌లకు దక్కనున్నాయి. కాకపోతే ఈ రుణ డిమాండ్‌ను తట్టుకునే పరిస్థితుల్లో బ్యాంక్‌లు

నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ గాడిలోకి..

Friday 9th November 2018

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్‌) నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి బలంగా సమర్థించుకుంది. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత క్రమబద్ధమయిందని, పన్ను పరిధి విస్తృతమైందని, డిజిటైజేషన్‌కు సైతం దారితీసిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. దీంతో పేదల ఆర్థిక స్థితుల్లో వృద్ధి, మౌలిక సదుపాయాల కోసం మరిన్ని నిధులను వినియోగించే అవకాశం ప్రభుత్వానికి లభించిందన్నారు. భారత్‌ వరుసగా ఐదో ఏడాది అత్యంత వేగంగా వృద్ధి

Most from this category