STOCKS

News


యస్‌ బ్యాంక్‌లో మళ్లీ చేరే ప్రశ్నే లేదు

Friday 14th June 2019
news_main1560495142.png-26290

యస్‌ బ్యాంక్‌లో మళ్లీ పాగా వేయనున్నారన్న వార్తలను యస్‌ బ్యాంక్‌ మాజీ సీఈఓ రాణా కపూర్‌ తోసిపుచ్చారు. ప్రస్తుత సీఈఓ రవ్‌నీత్‌ గిల్‌, ప్రస్తుత డైరెక్టర్ల బోర్డ్‌పై పూర్తి విశ్వాసం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత సంధి కాలం నుంచి యస్‌బ్యాంక్‌ విజయవంతంగా బయటపడగలదని పేర్కొన్నారు. రాణా కపూర్‌ వారసుడిగా రవ్‌నీత్‌ గిల్‌ ఈ ఏడాది మార్చిలో  సీఈఓగా పగ్గాలు చేపట్టారు. భారీ ప్రక్షాళన చేపట్టిన ఫలితంగా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో యస్‌బ్యాంక్‌కు రూ.1,500 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. 

రాణా కపూర్‌కు యస్‌ బ్యాంక్‌లో 9 శాతం వాటా ఉంది. బుధవారం జరిగిన ఏజీఎమ్‌లో 19 తీర్మానాలకు రాణా కపూర్‌ ప్రమోటర్‌ గ్రూప్‌ పూర్తి మద్దతు ప్రకటించింది. కాగా ఈ ఏజీఎమ్‌కు ముందే హఠాత్తుగా బ్యాంక్‌ ఇద్దరు డైరెక్టర్లు-అజయ్‌ కుమార్‌, ముకేశ్‌ సభర్వాల్‌లు రాజీనామా చేయడంతో పలు ఊహాగానాలు చెలరేగాయి. 

కాగా యస్‌ బ్యాంక్‌ రేటింగ్‌ను తగ్గిస్తామని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ బుధవారం హెచ్చరించింది. నగదు లభ్యత సమస్యతో విలవిలలాడుతున్న నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌, రియల్టీ కంపెనీలకు యస్‌బ్యాంక్‌ భారీగా రుణాలిచ్చిందని, ఫలితంగా బ్యాంక్‌ పనితీరు ప్రభావితం కానున్నదని మూడీస్‌ పేర్కొంది. మరోవైపు గురువారం స్విస్‌ బ్రోకరేజ్‌ సంస్థ, యూబీఎస్‌ యస్‌ బ్యాంక్‌ టార్గెట్‌ ధరను రూ.170 నుంచి రూ.90కు తగ్గించింది. బ్యాంక్‌ మార్జిన్లు, ఫీజు ఆదాయం, రుణ వృద్ధి చెప్పుకోదగ్గ స్థాయిలో క్షీణించనున్నాయని పేర్కొంది. 



You may be interested

కార్పొరేట్‌ బాండ్లలో పెట్టుబడులపై పన్ను రాయితీలు

Friday 14th June 2019

టర్మ్‌ బీమా ప్రీమియంపైనా అదనపు పన్ను రాయితీ కేంద్రానికి ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ సూచనలు న్యూఢిల్లీ: రిటైల్‌ ఇన్వెస్టర్లకు పన్ను రాయితీలను మరింత విస్తరించాలని ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ కేంద్ర ఆర్థిక శాఖకు సూచించాయి. కార్పొరేట్‌ బాండ్లలో ఇన్వెస్ట్‌మెంట్‌పై పన్ను రాయితీలు ఇవ్వాలని, అలాగే, టర్మ్‌ బీమా ప్లాన్ల ప్రీమియంపైనా అదనపు పన్ను రాయితీలు కల్పించాలని కోరాయి. జూలై 5న కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి

ఇండియాబుల్స్‌ పై పిటీషన్‌ వెనక్కి

Friday 14th June 2019

ముంబై: ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌(ఐబీహెచ్‌ఎఫ్‌)కు గురువారం భారీ ఊరట లభించింది. ఈ కంపెనీలో రూ.98,000 కోట్ల మేర అవకతవకలు జరిగాయని, దీనిపై విచారణ చేయాలంటూ సుప్రీం కోర్ట్‌లో అభయ్‌ యాదవ్‌ అనే వ్యక్తి ఒక పిటీషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటీషన్‌ను గురువారం నాడు అభయ్‌ యాదవ్‌ ఉపసంహరించుకున్నాడు. పిటీషన్‌లో పేర్కొన్న ఆరోపణలు, ఫిర్యాదులు తనకు తెలియవని, తాను సంతకం చేసిన డాక్యుమెంట్లను దుర్వినియోగం చేసి కంపెనీకి

Most from this category