News


క్యు3 ఫలితాలపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనాలు

Saturday 12th January 2019
Markets_main1547301501.png-23555

మూడో త్రైమాసికంలో వివిధ రంగాల ఫలితాలపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనాలు వెలువరించింది. ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్‌ అప్లయిన్సెస్‌, ఆల్కహాల్‌ అండ్‌ బెవరేజెస్‌, హోటల్స్‌ రంగాలకు చెందిన కంపెనీల ఫలితాలు ఎలా ఉండొచ్చనే విషయాన్ని వివరించింది. 
ఎఫ్‌ఎంసీజీ: ఈ రంగంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని బ్రోకరేజ్‌ సంస్థ భావిస్తోంది. ప్రభుత్వం లిక్విడిటీ మెరుగుపరిచే చర్యలు తీసుకోవడం, రైతు రుణమాఫీలు, ట్రేడ్‌ ఛానెల్స్‌ సాధారణ స్థితికి రావడం, ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండడం వంటి పరిస్థితులు కలిసివస్తాయని తెలిపింది. సాధారణ ఎన్నికల కారణంగా ప్రభుత్వం కొత్తగా ఎలాంటి అనూహ్య పన్నులు విధించకపోవచ్చని, కంపెనీల రూరల్‌ వాటాలు పెరగవచ్చని అంచనా వేసింది. రూరల్‌ డిమాండ్‌ పుంజుకుంటున్న వేళ ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు రెడీగా ఉన్న కంపెనీలను ఎంచుకోవచ్చని సలహా ఇచ్చింది. 
టాప్‌ సిఫార్సులు: ఐటీసీ, డాబర్‌, జుబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్‌.

ఇతర రంగాలపై బ్రోకరేజ్‌ సంస్థ అంచనాలు, వివరాలకు కింద ఇచ్చిన పీడీఎఫ్‌ లింక్‌ను క్లిక్‌ చేయండి. 

View Pdf One (1547301571Consumer_-_3QFY19_Results_Preview_-_HDFC_sec.pdf)

You may be interested

పెళ్లి కోసం లోన్‌ తీసుకుంటున్నారా?

Saturday 12th January 2019

కొత్త శతాబ్దపు యువత ఇటీవల కాలంలో వివాహానికి లోన్‌ తీసుకోవడం పరిపాటైంది. ధూంధాంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న కుర్రకారు ఇందుకోసం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణం తీసుకుంటున్నారు. అయితే ఈ రుణ భారం తమపై, తమ ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి భారం మోపుతుందో తెలుసుకోలేకపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. పేరుకు మ్యారేజ్‌ లోన్‌ కానీ అది కూడా ఒక రకమైన పర్సనల్‌ లోనేనని, పర్సనల్‌ లోన్స్‌లాగానే ఎక్కువ వడ్డీ ఉంటుందని చెబుతున్నారు.

లాంగ్స్‌కు 10628 పాయింట్లే స్టాప్‌లాస్‌!

Saturday 12th January 2019

నిఫ్టీ గతవారం 10870 పాయింట్ల కీలక నిరోధ స్థాయిని దాటలేక వెనుదిరిగింది. దిగువన 10730 పాయింట్ల రేంజ్‌లో మద్దతు పొందిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. తొమ్మిది వారాలుగా నిఫ్టీ అర్ధంపర్ధంలేకుండా అటుఇటు తిరుగుతోందన్నారు. ఒక వారం పైవైపునకు, మరోవారం కిందవైపునకు తిరుగుతూ స్వల్ప రేంజ్‌లోనే కదలాడుతోందని పేర్కొంది. వీక్లీ చార్టుల్లో గతవారం నిఫ్టీ ఇన్‌సైడ్‌బార్‌ పాటర్న్‌ను ఏర్పరిచింది. ఈ వారం కూడా అనిశ్చితి కొనసాగుతుందనేందుకు ఇది నిదర్శనమని తెలిపింది. ర్యాలీ

Most from this category