పీఎస్‌యూ కన్నా.. ప్రైవేట్ మిన్న..
By Sakshi

ముంబై: ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలతో పోలిస్తే ప్రైవేట్ బీమా సంస్థలు గణనీయ స్థాయిలో వృద్ధి సాధిస్తున్నాయి. 2017–18లో 22 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. అదే సమయంలో ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) సాధారణ బీమా సంస్థలు 13 శాతమే వృద్ధి సాధించాయి. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం సాధారణ బీమా రంగం 17 శాతం మేర వృద్ధి చెందింది. ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల మార్కెట్ వాటా 53 శాతం నుంచి 55 శాతానికి పెరిగింది. హెల్త్, మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంల ఊతంతో ప్రైవేట్ సంస్థలు రికవరీకి సారథ్యం వహిస్తున్నాయని ఇక్రా గ్రూప్ హెడ్ (ఫైనాన్షియల్ సెక్టార్ రేటింగ్స్ విభాగం) కార్తీక్ శ్రీనివాసన్ తెలిపారు. ప్రైవేట్ సాధారణ బీమా సంస్థల పంట బీమా వ్యాపార విభాగం వృద్ధి కూడా కొనసాగుతుందని, అయితే 2016–17 స్థాయిలో ఉండకపోవచ్చని ఆయన వివరించారు. ప్రైవేట్ సంస్థలకు అదనపు మూలధనం..
మరోవైపు, అండర్‌రైటింగ్ నష్టాలను తగ్గించుకోవడం ద్వారా పీఎస్‌యూ బీమా సంస్థలు వృద్ధిని క్రమబద్ధీకరించుకుంటున్నాయని, దీంతో గత ఆర్థిక సంవత్సరం వాటి వృద్ధి 13 శాతానికి పరిమితమైందని శ్రీనివాసన్ చెప్పారు. అగ్ని ప్రమాదాలు, స్థిరాస్తి, మోటార్ ఓన్ డ్యామేజ్ (ఓడీ) విభాగాలు మందగించినట్లు తెలిపారు. అయితే, హెల్త్, మోటార్ థర్డ్ పార్టీ విభాగాల్లో పీఎస్‌యూ బీమా సంస్థలు గణనీయ వృద్ధి నమోదు చేశాయని పేర్కొన్నారు.
ప్రస్తుత 17–20 శాతం వృద్ధి రేటును కొనసాగించాలంటే ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1,200–3,000 కోట్ల మేర మూలధనం అవసరమవుతుందని ఇక్రా పేర్కొంది. అయితే, ప్రస్తుత స్థాయి లాభదాయకత కొనసాగిస్తే రూ. 1,200 కోట్లు సరిపోవచ్చని అంచనా వేసింది. బీమా కంపెనీలు నిధుల సమీకరణకు టయర్ 2 బాండ్ల జారీ మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉందని తెలిపింది. బీమా కంపెనీలు ఇప్పటిదాకా ఈ మార్గంలో రూ. 25,800 కోట్ల దాకా సమీకరించినట్లు వివరించింది.
You may be interested
మిడ్‌క్యాప్స్ పతనంలో ఫండ్స్ ఎంచుకొన్న షేర్లివి
Friday 13th July 2018ఈ ఏడాది మిడ్‌క్యాప్ సూచీ 18 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 24 శాతం వరకు పతనమయ్యాయి. దీంతో కొందరు విశ్లేషకులు మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ కంటే లార్జ్‌క్యాప్ స్టాక్స్ రిస్క్, రాబడుల పరంగా నయమంటూ సూచనలు కూడా ఇస్తున్నారు. కానీ, ఇదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్లు కొన్ని మిడ్, స్మాల్ స్టాక్స్‌లో కొనుగోళ్లు చేయడం విశేషం. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి 1,000 కంపెనీల వాటాదారుల
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ.4,000 కోట్ల షేర్ల బైబ్యాక్
Thursday 12th July 2018ముంబై: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీ రూ.4,000 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనున్నది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ.1,100 ధరకు మొత్తం 3.63 కోట్ల షేర్లను(మొత్తం షేర్లలో ఈ షేర్లు 2.61 శాతం వాటాకు సమానం) బైబ్యాక్ చేయడానికి తమ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. గురువారం బీఎస్ఈలో ఈ షేర్ 1 శాతం లాభంతో రూ.1,005 వద్ద ముగిసింది. ఈ