STOCKS

News


ప్రభుత్వానికి రూ.6 లక్షల కోట్ల నష్టం

Saturday 13th October 2018
Markets_main1539409248.png-21106

ముంబై: స్టాక్‌ మార్కెట్లలో దిద్దుబాటు కేంద్ర ప్రభుత్వానికీ భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. తాజా పతనంలో ప్రభుత్వరంగ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ గణనీయంగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ నష్టం రూ.6 లక్షల కోట్లకు పైమాటే. గణాంకాలను గమనిస్తే... 41 ప్రభుత్వరంగ కంపెనీల (పీఎస్‌యూలు) మార్కెట్‌ విలువ వాటి 52 వారాల గరిష్ట ధర నుంచి చూస్తే సగానికి పడిపోయింది. మరో 32 పీఎస్‌యూల మార్కెట్‌ విలువ 12- 44 శాతం మధ్యలో క్షీణించింది. పీఎస్‌యూల పట్ల ఇన్వెస్టర్లలో సెంటిమెంట్‌ చారిత్రకంగా చాలా కనిష్ట స్థాయిలో ఉందని నిపుణులు చెబుతున్నారు. ‘‘పీఎస్‌యూ కంపెనీలు అవి లార్జ్‌క్యాప్‌ అయినా, మిడ్‌క్యాప్‌ అయినా అన్నీ ప్రతికూల పనితీరునే చూపించాయి. ఆర్థిక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం రాజీపడడాన్ని ఇన్వెస్టర్లు ఇష్టపడరు. చమురు ధరల తగ్గింపులో కొంత భారాన్ని మోయాలని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలను కేంద్రం కోరడం ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసింది’’ అని ఓ విశ్లేషకుడు తాజా పరిస్థితిని కళ్లకు కట్టారు. ప్రభుత్వ తాజా నిర్ణయం ధరల నియంత్రణ సడలింపును వెనక్కి తీసుకుందన్న సంకేతాన్ని ఇచ్చిందని, ఇది సెంటిమెంట్‌ను గాయపరిచినట్టు స్టీవర్ట్‌ అండ్‌ మ్యాక్‌రిచ్‌ తన క్లయింట్‌ నోట్‌లో తెలియజేసింది.
వీటిలో నష్టం ఎక్కువ... 
పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తూ... ఒక్కో లీటర్‌పై రూపాయి చొప్పున ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు భరించాలని ప్రభుత్వం కోరిన తర్వాత కేవలం ఇంధన రంగానికి చెందినవే కాకుండా ఇతర పీఎఎస్‌యూల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో అవి తీవ్రంగా నష్టపోయాయి. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలైన ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ 16-26 శాతం స్థాయిలో నష్టపోయాయి. ఇంతకంటే ఎక్కువే నష్టపోయినప్పటికీ కాస్తంత కోలుకున్నాయి. ఇప్పటికీ ఈ కంపెనీల షేర్లు వాటి 52 వారాల గరిష్ట స్థాయికి 40-57 శాతం తక్కువ వద్దే ట్రేడ్‌ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఐవోసీలో 56.75 శాతం, బీపీసీఎల్‌లో 53.9 శాతం వాటాలున్నాయి. హెచ్‌పీసీఎల్‌లో 51 శాతం వాటా కలిగిన ఓఎన్‌జీసీ కూడా ప్రభుత్వరంగ కంపెనీయే. ఇందులో కేంద్రానికి 67.48 శాతం వాటా ఉంది. ఇక వీటి తర్వాత ఎక్కువగా ప్రభుత్వరంగ బ్యాంకుల విభాగంలో నష్టం కలిగింది. 16 పీఎస్‌బీలు 52 వారాల గరిష్ట ధరలకు 44-70 శాతం తక్కువకు ట్రేడ్‌ అవుతున్నాయి. బ్యాంకింగ్‌ రంగం ప్రస్తుతం రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిల సమస్య (ఎన్‌పీఏలు) ఎదుర్కొంటుంటే ఇందులో 80-90 శాతం ప్రభుత్వరంగ బ్యాంకులవే. పీఎన్‌బీ, సెంట్రల్‌ బ్యాంక్‌ స్టాక్స్‌ ఎక్కువగా పతనం అయ్యాయి. ఇవి 52 వారాల గరిష్ట ధరల నుంచి చూస్తే 70 శాతం పడిపోయాయి. కీలకమైన ఎన్‌పీఏల సమస్యపై స్పష్టత వస్తేనే ప్రభుత్వరంగ బ్యాంకులపై సెంటిమెంట్‌ మెరుగుపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఎస్సార్‌ స్టీల్‌, బినానీ సిమెంట్‌ ఎన్‌పీఏ ఖాతాలకు పరిష్కారం లభిస్తే అది ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లలో కదలికకు దారితీస్తుంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ అంశంపైనా మార్కెట్‌కు స్పష్టత అవసరం’’ అని మార్కెట్‌ నిపుణుడు ఎస్‌పీ తులసియాన్‌ పేర్కొన్నారు. ఇక గడిచిన 12 నెలల కాలంలో కేంద్రం ఎనిమిది పబ్లిక్‌ ఇష్యూలను చేపట్టింది. రూ.27,000 కోట్లకు పైగా నిధులను సమీకరించింది. అయితే, వీటిలో ఐదు కంపెనీలు ఇష్యూ ధర కంటే 24-48 శాతం తక్కువలో ట్రేడ్‌ అవుతున్నాయి. పీఎస్‌యూ షేర్ల ధరల పతనంతో ప్రభుత్వం పెట్టుకున్న పెట్టుబడుల ఉపసంరహరణ లక్ష్యం అంత సులభం కాదన్న అభిప్రాయం విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. 



You may be interested

పుత్తడి, వెండిల్లో కమోడిటీ డెరివేటివ్స్‌

Saturday 13th October 2018

ముంబై: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ) పుత్తడి, వెండిల్లో కమోడిటీ డెరివేటివ్స్‌ను శుక్రవారం నుంచి ప్రారంభించింది. కమోడిటీ డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌లో భాగంగా ముందుగా వ్యవసాయేతర కమోడిటీ డెరెవేటివ్స్‌ ట్రేడింగ్‌ను అందుబాటులోకి తెస్తున్నామని ఎన్‌ఎస్‌ఈ ఎమ్‌డీ, సీఈఓ విక్రమ్‌ లిమాయే చెప్పారు. ఆ తర్వాత వ్యవపాయ ఉత్పత్తులను కూడా అందుబాటులోకి తెస్తామని వివరించారు. ప్రస్తుతం పుత్తడిలో ఒక కేపీ, 100 గ్రాములు, వెండి(30కేజీ) విభాగాల్లో కమోడిటీ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టులను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ

ఉక్కు ప్లాంట్ల విక్రయానికి ఆర్సెలర్‌ మిట్టల్ డీల్‌

Saturday 13th October 2018

న్యూఢిల్లీ: ఉక్కు దిగ్గజం ఆర్సెలర్‌మిట్టల్‌ తాజాగా యూరప్‌లోని తమ స్టీల్‌ ప్లాంట్లలో నాలుగింటిని లిబర్టీ హౌస్‌కు విక్రయించడానికి సిద్ధమయింది. ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇల్వా ఎస్‌పీఏ కొనుగోలుకు సంబంధించి యూరోపియన్ కమిషన్‌ (ఈయూ) విధించిన షరతులకు అనుగుణంగా ఈ నాలుగింటినీ ఆర్సెలర్‌ మిట్టల్ విక్రయిస్తోంది. ఒస్ట్రావా (చెక్‌ రిపబ్లిక్‌) గలాటి (రొమేనియా), స్కోప్యే (మెసిడోనియా), ప్యాంబినో (ఇటలీ) ప్లాంట్ల కొనుగోలు కోసం లిబర్టీ హౌస్ గ్రూప్

Most from this category