News


మరో రూ.50వేల కోట్లు కేటాయించండి

Thursday 16th May 2019
news_main1557998966.png-25779

ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.50,000 కోట్ల మూలధనాన్ని కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఈ మేరకు ఎకనామిక్స్‌ టైమ్స్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. అధిక రీక్యాపిటలైజేషన్‌ కేటాయింపుతో బ్యాంకుల రుణ వృద్ధిని మరింత పెంచుకోవడంతో పాటు ద్రవ్య కొరత సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని పీఎస్‌యూ బ్యాంకులు భావిస్తున్నాయి. ఈ ప్రతిపాదినపై ఆర్థిక మంత్రిత్వశాఖ మరింత లోతుగా అధ్యయనం చేస్తుందని సంబంధింత వర్గాలు తెలిపాయి. అయితే, మే 23 తరువాత ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ ఏడాదిలో కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో బ్యాంకులకు ఎలాంటి కేటాయింపులు జరగలేదు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌బీల్లోకి కేంద్ర ప్రభుత్వం రూ.1.06 లక్షల కోట్ల మేర నిధులను చొప్పించింది. వాస్తవానికి తొలుత ప్రభుత్వం పీఎస్‌బీలకు మూలధన సాయంగా రూ.65,000 కోట్లు ఇవ్వాలని అనుకుంది. అయితే బ్యాంకుల్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా కేంద్రం ఈ మొత్తాన్ని విడుతల వారిగా ఈ మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లింది. మొండి బకాయిల (ఎన్‌పీఏ) వసూళ్లలో దివాలా స్మృతి (ఐబీసీ) ప్రక్రియ సైతం నెమ్మదిగా జరుతున్నట్లు బ్యాంకులు తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఐబీసీ చట్టం ద్వారా మొండిబకాయిలు రెట్టింపు వసూళ్లను సాధించాయి. ప్రభుత్వం రూ.35,000 కోట్ల వసూళ్లను అంచనా వేయగా, రూ.70,000 కోట్ల వసూళ్లు అయ్యాయి. 



You may be interested

హిండాల్కో లాభంలో 18 శాతం క్షీణత

Thursday 16th May 2019

మార్చి త్రైమాసికానికి హిండాల్కో ఇండస్ట్రీస్‌ నికర లాభం 17.9 శాతం క్షీణించి రూ. 506 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ 616 కోట్ల రూపాయల లాభం నమోదు చేసింది.  ఉత్కల్‌ ఆపరేషన్లను మినహాయించి లెక్కిస్తే స్టాండలోన్‌ నికరలాభం 37.4 శాతం పతనమై రూ. 377 కోట్ల నుంచి రూ. 236 కోట్లను చేరింది.  సమీక్షా కాలంలో రెవెన్యూ రూ. 11687 కోట్ల నుంచి రూ. 12455 కోట్లకు

అమ్మకాల మూడ్‌లో ఎఫ్‌పీఐలు!

Thursday 16th May 2019

పెరుగుతున్న షార్ట్‌ పొజిషన్లు విదేశీ సంస్థాగత మదుపరులు ఇండియా ఈక్విటీల్లో విక్రయాల మూడ్‌లోకి మారారు. యూఎస్‌, చైనా ట్రేడ్‌వార్‌, ఎన్నికల ఫలితాలపై నెగిటివ్‌ వార్తలతో విదేశీ మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణకు దిగారు. కేవలం ఒక్క బుధవారమే ఎఫ్‌ఐఐలు రూ. 1142 కోట్ల షేర్లను విక్రయించారు. మేసీరిస్‌లో ఎఫ్‌ఐఐలు రూ. 3100 కోట్ల నికర విక్రయాలు జరిపారు. మేలో జరిగిన పది ట్రేడింగ్‌ సెషన్లలో ఏడు సెషన్లు ఎఫ్‌ఐఐలు నికర విక్రయాలకు మొగ్గు

Most from this category