STOCKS

News


మార్కెట్లో ముందే ‘దీపావళి’

Friday 12th October 2018
Markets_main1539326387.png-21084

ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్‌.. ఇన్వెస్టర్ల కోసం దీపావళిని ముందే తీసుకువచ్చిందంటున్నారు మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా ఎండీ రిధమ్‌ దేశాయ్‌. ఖరీదైన స్టాక్స్‌ చౌకగా లభ్యమౌతున్నాయని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్‌లోని ఒడిదుడుకులు దీర్ఘకాల ఇన్వెస్టర్లకు మంచి అవకాశాలను అందిస్తున్నాయని తెలిపారు. కాగా ఆగస్ట్‌ నుంచి చూస్తే సెన్సెక్స్‌, నిఫ్టీ ఇండెక్స్‌లు 12 శాతానికిపైగా పతనమయ్యాయి. రూపాయి క్షీణత, క్రూడ్‌ ధరలు ఎగయడం,  అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడం, లిక్విడిటీ ఆందోళనలు, విదేశీ ఇన్వెస్టర్ల దేశీ ఈక్విటీ మార్కెట్ల నుంచి నిధులను వెనక్కు తీసుకెళ్లడం, ఎన్నికలు వంటి అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. 
రిస్క్‌పై ఆధారపడి రిటర్న్స్‌ ఉంటాయని దేశాయ్‌ తెలిపారు. ఎంత ఎక్కువ రిస్క్‌ తీసుకోవడానికి సిద్ధపడతామో.. అదే స్థాయిలో రిటర్న్స్‌ కూడా ఉంటాయని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఈక్విటీలు అనేవి దీర్ఘకాలం కొనసాగించాల్సిన అసెట్స్‌ అని తెలిపారు. అందువల్ల మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చే వారు దీర్ఘకాల లక్ష్యంలో ఇన్వెస్ట్‌మెంట్లు కొనసాగించాలని సూచించారు. ‘ఒక వారంలోనో.. నెలలోనో డబ్బులు సంపాదించాలని భావించకూడదు. ప్రస్తుతం మార్కెట్‌లో కొనుగోలుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. స్టాక్స్‌ ధరలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అందువల్ల ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు ఇప్పుడు నచ్చిన స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చు. వీటిని నెలలపాటు హోల్డ్‌ చేయాల్సి ఉంటుంది’ అని వివరించారు. వర్ధమాన మార్కెట్లకు జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందని, ఇప్పుడు అభివృద్ధి చెందిన మార్కెట్ల వంతని తెలిపారు. ఇటీవల కాలంలో లిక్విడిటీ ఆందోళనలు మార్కెట్‌ను వెంటాడాయని పేర్కొన్నారు. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని, భవిష్యత్‌ వృద్ధి బాగుంటుందని అంచనా వేశారు. కాగా మోర్గాన్‌ స్టాన్లీ గతంలో 2019 సెప్టెంబర్‌ కల్లా సెన్సెక్స్‌ 42,000 పాయింట్లకు చేరుతుందని అంచనా వేసింది. 
సమీప కాలంలో అధిక క్రూడ్‌ ధరలు, బలహీనమైన రూపాయి వంటి అంశాలు దేశీ మార్కెట్లకు రిస్క్‌ అంశాలని దేశాయ్‌ తెలిపారు. క్రూడ్‌ ధరల పెరుగుదల వల్ల భారత్‌ ఆర్థిక వ్యవస్థను పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు. క్రూడ్‌ ధరలు 90-95 డాలర్లకు చేరొచ్చని అంచనా వేశారు. పండుగ సీజన్‌ నేపథ్యంలో వృద్ధి పట్టాలెక్కవచ్చని తెలిపారు. ఆర్థిక వృద్ధి కంపెనీల ఎర్నింగ్స్‌లో ప్రతిఫలిస్తుందని పేర్కొన్నారు. నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్లతో పోలిస్తే కార్పొరేట్‌ బ్యాంకుల ఎర్నింగ్స్‌ బాగుంటాయని తెలిపారు. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఐటీ, ఎనర్జీ కంపెనీలు బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించొచ్చని పేర్కొన్నారు. అలాగే బ్యాంకులు, టెలికం రెవెన్యూ నెమ్మదించొచ్చని తెలిపారు. ఇన్వెస్టర్లు ఎన్‌బీఎఫ్‌సీల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎగుమతి ప్రధాన ఆటో కంపెనీల స్టాక్స్‌కు ప్రాధాన్యమివ్వొచ్చని తెలిపారు. 



You may be interested

టీసీఎస్‌ షేరును ఏం చేద్దాం?

Friday 12th October 2018

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టీసీఎస్‌ క్యు2 ఫలితాలు ప్రకటించింది. అంచనాలకు అనుగుణంగానే ఫలితాలున్నా షేరు మాత్రం శుక్రవారం ట్రేడింగ్‌లో దాదాపు 3 శాతం నష్టంలో ట్రేడవుతోంది. ఈ నెల్లో టీసీఎస్‌ షేరు దాదాపు 15 శాతం మేర క్షీణించింది. ఫలితాలు బాగున్నా షేరులో పాజిటివ్‌ కదలికలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో టీసీఎస్‌ ఫలితాలు, షేరుపై ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు ఎలాంటి సలహా ఇస్తున్నాయో చూద్దాం... పాజిటివ్‌ అంచనాలు ఇచ్చిన సంస్థలు - సీఎల్‌ఎస్‌ఏ:

బ్యాంక్‌ నిఫ్టీ 3శాతం అప్‌

Friday 12th October 2018

మార్కెట్‌ రికవరీలో భాగంగా గురువారం బ్యాకింగ్‌ షేర్లు భారీగా లాభాపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ ఇంట్రాడేలో 3శాతం లాభపడింది. నేడు నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ 25000ల పైన ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో పలు బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ కారణంగా నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ 3శాతం లాభపడి 25,484 గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(24,784)తో పోలిస్తే 2.66శాతం లాభంతో 25,443.25

Most from this category