STOCKS

News


గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌...నిఫ్టీ అప్‌ 40 పాయింట్లు

Wednesday 13th February 2019
Markets_main1550029384.png-24163

ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో బుధవారం భారత్‌ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌126 పాయింట్ల పెరుగుదలతో 36,280 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 39 పాయింట్ల లాభంతో 10870 పాయింట్ల వద్ద మొదలయ్యింది. క్రితం​ రోజు ప్రోత్సాహకర ఫలితాల్ని ప్రకటించిన సన్‌ఫార్మా 2.5 శాతం గ్యాప్‌అప్‌తో రూ. 500 వద్ద మొదలై నిఫ్టీ-50లో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఇండెక్స్‌ హెవీవెయిట్‌ ఐటీసీ 2 శాతంపైగా పెరిగి సూచీల ప్రారంభ ర్యాలీకి కారణమయ్యింది. టీసీఎస్‌, కోల్‌ ఇండియా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, కోల్‌ ఇండియాలు 1-2 శాతం మధ్య లాభంతో మొదలయ్యాయి. మరోవైపు హింద్‌ పెట్రో, భారతి ఎయిర్‌టెల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, హీరో మోటో కార్‌‍్పలు స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. 

ప్రపంచ మార్కెట్లు అప్‌

 అమెరికా ప్రభుత్వ షట్‌డవున్‌కు తెరపడుతుందన్న వార్తలు, అమెరికా, చైనా వాణిజ్య చర్చల సఫలంపై ఆశావహ అంచనాలతో గత రాత్రి అమెరికా  సూచీలు 1.5 శాతం మేర పెరగ్గా, యూరప్‌ సూచీలుకూడా 1 శాతం వరకూ ర్యాలీ జరిపాయి. తాజాగా జపాన్‌ సూచీ 1.5 శాతం లాభాల్లో ట్రేడవుతుండగా, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, చైనా షాంఘై, కొరియా కోస్పి ఇండెక్స్‌లు అరశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ స్ర్టయిట్‌టైమ్స్‌ 1 శాతం వరకూ పెరిగింది. తైవాన్‌ సూచి మాత్రం నష్టాల్లో ట్రేడవుతోంది.



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 13th February 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు:- ధావన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌:- కంపెనీ స్వతంత్ర డెరెక్టర్‌ పదవికి విజయ సంపత్‌ రాజీనామా చేశారు.  ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, అలహాదాబాద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఇండియన్‌ ఓవర్సీ్‌స్‌ బ్యాంక్‌, ఆంధ్రా బ్యాంక్‌:- నిధుల వినియోగంగలో విఫలమైన కారణంగా ఆర్‌బీఐ ఈ నాలుగు బ్యాంక్‌లపై రూ.1.50 కోట్ల జరిమానా విధించింది.  అలెంబిక్‌ ఫార్మా:- హృదయ వ్యాధుల చికిత్సలో వినియోగించే ఫెనోఫైబ్రేట్‌ ఔషధాలకు

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 33 పాయింట్లు అప్‌

Wednesday 13th February 2019

అమెరికా ప్రభుత్వ షట్‌డవున్‌కు తెరపడుతుందన్న వార్తలు, అమెరికా, చైనా వాణిజ్య చర్చల సఫలంపై ఆశావహ అంచనాలతో గత రాత్రి అమెరికా, యూరప్‌ సూచీల పెరగడానికి తోడు, తాజాగా ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్న నేపథ్యంలో బుధవారం ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 33 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.50  గంటలకు 10,893పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10,860 పాయింట్ల వద్ద

Most from this category