STOCKS

News


ఎన్నికల భయంతో ఇండియాకు దూరం..

Thursday 14th February 2019
Markets_main1550139276.png-24200

దేశీయ ఈక్విటీలపై ఆసక్తి చూపని విదేశీ ఫండ్ మేనేజర్లు
ఈ ఏడాది వర్ధమాన దేశాల మార్కెట్లతో పోలిస్తే ఇండియా ఈక్విటీలు నీరస ప్రదర్శన చేశాయి. త్వరలో సాధారణ ఎన్నికలు జరుతున్న సమయాన దేశీయ ఈక్విటీలపై ఫండ్‌ మేనేజర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో భారత మార్కెట్లు దూసుకుపోలేకపోతున్నాయి. ఇదే సమయంలో విదేశీ ఫండ్‌ మేనేజర్లు ఇతర వర్ధమాన మార్కెట్లపై ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నారు. ఈ ఏడాదిలో ఇంతవరకు నిఫ్టీ 0.63 శాతం నష్టపోగా, చైనా, రష్యా, బ్రెజిల్‌ సూచీలు వరుసగా 9, 13, 9.5 శాతాల మేర లాభపడ్డాయి. ప్రస్తుతం భారత్‌ అల్పబీటా ఎమర్జింగ్‌ మార్కెటని ఒప్పెన్‌హీమర్‌ ఫండ్‌మేనేజర్‌ కృష్ణ మెమాని చెప్పారు. ఇండియాలో కొన్ని మంచి కంపెనీలున్నా, ఇతర వర్ధమాన దేశాల మార్కెట్లలో అంతకుమించిన అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. వాల్యూషన్ల భయాలు, రాజకీయ రిస్కులు, విత్తలోటు ఆందోళనలు కలిసి ఇండియా ఈక్విటీలపై అనాసక్తతను పెంచుతున్నాయన్నారు.

రాబోయే ఎన్నికల సందర్భంగా మార్కెట్లలో అప్రమత్తత కనిపిస్తోంది. ఎన్నికల అనంతరం స్థిర ప్రభుత్వం వస్తుందా? రాదా? అన్న అనుమానాలు ఇన్వెస్టర్లను వెనక్కులాగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్‌ 22.2 పీఈ వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో వర్దమాన మార్కెట్‌ సూచీ(ఎంఎస్‌సీఐ ఇండెక్స్‌) 12.1 పీఈ వద్ద ఉంది. దీంతో పోలిస్తే భారత ఈక్విటీ వాల్యూషన్లు ఇంకా ఎక్కువగానే ఉన్నట్లు భావించాలి. ఈ కారణంగానే ఇండియా పోర్టుఫోలియో నుంచి క్రమంగా వైదొలుగుతున్నామని గ్లోవిస్టా ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ ప్రతినిధి దర్శన్‌భట్‌ తెలిపారు. భారత మార్కెట్ల నుంచి నిధులను ఇతర వర్ధమాన మార్కెట్లకు మరలుస్తున్నామన్నారు. ఇతర ఫండ్స్‌ కూడా ఇదే బాట పట్టడంతో గత కొన్ని వారాలుగా అభివృద్ధిచెందిన దేశాల మార్కెట్ల కన్నా వర్ధమాన మార్కెట్లలోకి నిధుల ప్రవాహం ఎక్కువైంది. దీర్ఘకాలానికి భారత్‌ మార్కెట్లు మంచి రాబడులు ఇస్తాయని తమకు అంచనాలున్నాయని, కానీ స్వల్పకాలానికి మాత్రం ఇండియాలో పెద్దగా పెట్టుబడులు పెట్టడం లేదని భట్‌ తెలిపారు. ఎన్నికల హడావుడి తగ్గి స్థిర ప్రభుత్వం ఏర్పడితే తిరిగి భారత్‌ సూచీలు దూసుకుపోతాయని ఎన్‌ఎన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రతినిధి మార్టెన్‌ జాన్‌బక్కుమ్‌ చెప్పారు. ప్రస్తుతం ఇండియాలో పొజిషన్లను ఇంకా తగ్గించుకోలేదని, ఎన్నికల ముందు పొజిషన్లు తగ్గించుకుంటామని, తిరిగి ఎన్నికల అనంతరం కొత్త పెట్టుబడులపై ఆలోచిస్తామని వివరించారు. 
 



You may be interested

36000 దిగువన సెన్సెక్స్‌

Thursday 14th February 2019

10750 దిగువకు నిఫ్టీ సూచీ ఆరోరోజూ అమ్మకాలే..! అధిక పరిమాణం కలిగిన షేర్ల పతనంతో మార్కెట్‌ ఆరో రోజూ నష్టపోయింది.  ఇన్వెస్టర్ల అమ్మకాల పరంపర మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10750 మార్కును కోల్పోయి 47 పాయింట్లు నష్టంతో 10,746 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 158 పాయింట్లను కోల్పోయి 36వేల దిగువన 35,876 వద్ద ముగిసింది. ఈ 6రోజుల్లో సెన్సెక్స్‌ మొత్తం 1099 పాయింట్లను పోగొట్టుకుంది. మరోవైపు బ్యాంక్‌

నష్టాల్లోంచి.. లాభాల్లోకి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

Thursday 14th February 2019

దీవాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పోరేష‌న్ (డీహెచ్ఎఫ్ఎల్‌) షేరు గురువారం ట్రేడింగ్‌లో నష్టాల్లోంచి భారీ లాభాల్లోకి మళ్లింది. జాయింట్‌ ఎండీ, సీఈవో పదవులకు రాజీనామా చేశారనే వార్తలతో నేడు డీహెచ్ఎఫ్ఎల్‌ షేరు 5శాతం నష్టంతో రూ.105.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇం‍ట్రాడేలో మరొక శాతం(మొత్తం 6శాతం) క్షీణించి రూ.104.00ల కనిష్టానికి చేరుకుంది. కంపెనీ బోర్డు హర్షిల్‌ రాజీనామాకు వెంటనే ఆమోదం తెలిపినట్లు వార్తలు తెరపైకి రావడంతో షేరు తిరిగి లాభాల్లోకి మళ్లింది.

Most from this category