STOCKS

News


లోకల్‌ బాండ్లకు పిక్‌ ఎన్‌ హుక్‌

Saturday 12th January 2019
news_main1547272077.png-23544

- వేగంగా ఉత్పత్తుల డెలివరీ
- స్థానిక బ్రాండ్లకే ఎక్కువ ప్రాధాన్యం
- కంపెనీ సీఈవో మోనిష్‌ పత్తిపాటి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అన్ని వస్తువులనూ విక్రయించే ఈ–కామర్స్‌ కంపెనీగా ఆరంభమైన హైదరాబాద్‌ కంపెనీ ‘పిక్‌ ఎన్‌ హుక్‌’... ఇపుడు మిగతా చోట్ల దొరకని విభిన్న ఉత్పత్తుల విక్రయంపై దృష్టిపెట్టింది. తెలంగాణ చేనేత.. నిర్మల్‌ బొమ్మలు.. గద్వాల, ధర్మవరం, వెంకటగిరి చీరలు, కొండపల్లి బొమ్మల వంటి ప్రత్యేక వస్తువులను దేశవ్యాప్తంగా విక్రయించే  ప్రయత్నాలు చేస్తోంది. మార్చి నుంచి ఈ వస్తువులన్నీ అందుబాటులోకి తెస్తున్న సందర్భంగా ‘పిక్‌ ఎన్‌ హుక్‌’ ఫౌండర్‌ సీఈఓ మోనిష్‌ పత్తిపాటి ‘సాక్షి’ స్టార్టప్‌ డైరీతో తన అనుభవాల్ని పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే...
‘‘స్థానికంగా ఉండి, సొంతంగా వ్యాపారం చేయాలన్నదే నా కల. అందుకు తగ్గట్టే నోయిడాలోని అమిటీ యూనివర్సిటీలో బీబీఏ పూర్తి చేశాక 2016లో ‘పిక్‌ ఎన్‌ హుక్‌’ను ఆరంభించాం. రూ.కోటి పెట్టుబడితో మా నాన్నగారు ప్రసాద్‌ పత్తిపాటి సాయంతో ఆరంభించాం. ఆయనే చైర్మన్‌గా వెన్నంటి నడిపిస్తున్నారు. అనతి కాలంలోనే లక్ష మందికిపైగా కస్టమర్లు వచ్చారు. 1,000కి పైగా వెండర్లు తమ ఉత్పత్తుల్ని మా ప్లాట్‌ఫామ్‌పై విక్రయిస్తున్నారు. మంచి ధర.. వేగంగా డెలివరీ అనే రెండంశాలే మా ప్రత్యేకత.
ఈ ఏడాది మార్చి నుంచి కొత్త రూపుతో రంగంలోకి దిగుతున్నాం. యాప్‌తో పాటు వెబ్‌సైట్‌కు కూడా మరిన్ని ఫీచర్లు జోడిస్తాం. ఉత్పత్తుల శ్రేణి పెంచుతున్నాం. ఫ్రాడ్‌ డెలివరీని నిలువరించి క్వాలిటీ చెక్‌ వ్యవస్థను పట్టిష్టం చేశాం. తద్వారా ఫిర్యాదులు అర శాతం లోపే ఉంటున్నాయి. ప్రొడక్టుల ధరను సెల్లర్లే నిర్ణయిస్తారు. ఇక నిధుల విషయానికి వస్తే ప్రస్తుతానికి సొంత వనరులే ఖర్చు చేస్తున్నాం. నిధుల సమీకరణ గురించి మార్చి చివరికల్లా ఒక స్పష్టత వస్తుంది. పోటీ ఎంతున్నా ఈ రంగంలో నిలదొక్కుకుంటామన్న ధీమా ఉంది. అందులో భాగంగానే తెలుగు రాష్టా‍్లలకు చెందిన ప్రత్యేక ఉత్పత్తుల్ని మా ప్లాట్‌ఫామ్‌పైకి తెస్తున్నాం. లోకల్‌ బ్రాండ్స్‌కు దేశ, విదేశాల్లో ప్రాచుర్యంలోకి తీసుకు రావాలన్న కృతనిశ్చయంతో ఉన్నాం’’ అని మోనిష్‌ వివరించారు.



You may be interested

14 నుంచి బంగారం బాండ్ల విక్రయం

Saturday 12th January 2019

ముంబై: సౌర్వభౌమ బంగారం బాండ్లు మలి విడత విక్రయం ఈ నెల 14న ప్రారంభం కానుంది. 18వ తేదీ వరకు కొనసాగుతుంది. ఓ గ్రాము బంగారం ధర రూ.3,214గా ఆర్‌బీఐ ఖరారు చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, డిజిటల్‌ రూపంలో చెల్లించే వారికి గ్రాము బంగారంపై రూ.50ను తగ్గింపు ఇవ్వనున్నట్టు తెలిపింది. దీంతో గ్రాము బంగారాన్ని రూ.3,614కే ఇవ్వనుంది. బ్యాంకులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, ఎన్‌ఎస్‌ఈ,

ఈ ఏడాది సాయం 4.5 బిలియన్‌ డాలర్లు

Saturday 12th January 2019

- దీన్లో 3.5 బిలియన్‌ డాలర్లు ప్రభుత్వానికి - మరో బిలియన్‌ డాలర్లు ప్రయివేటు రంగానికి  భారత్‌పై ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రకటన - రైతు రుణ మాఫీ సరైన పరిష్కారం కాదని అభిప్రాయం న్యూఢిల్లీ: భారత్‌కు ఇచ్చే నిధుల సాయాన్ని 2019లో 4.5 బిలియన్‌ డాలర్లకు (రూ.31,500 కోట్లు) పెంచనున్నట్టు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ప్రకటించింది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని, వచ్చే

Most from this category