STOCKS

News


హైదరాబాద్‌ నం:1

Saturday 10th November 2018
personal-finance_main1541829897.png-21858

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికం (క్యూ3)లో దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి రూ.11,212 కోట్ల ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు వచ్చాయి. 2018 మూడు త్రైమాసికంలో కలిపి మొత్తం రూ.37,815 కోట్ల పీఈ నిధులొచ్చాయని.. ఏటా 9 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ నివేదిక తెలిపింది. గత 11 ఏళ్లతో పోలిస్తే ఈ త్రైమాసికంలోనే అత్యధిక పీఈ నిధులొచ్చాయి.
♦ ఈ ఏడాది క్యూ3లో అత్యధిక పీఈలను సమీకరించిన నగరాల జాబితాలో హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచింది. క్యూ3లో వచ్చిన మొత్తం నిధుల్లో 60 శాతం కేవలం భాగ్యనగారికే వచ్చాయని.. 22 శాతంతో ముంబై రెండో స్థానంలో నిలిచిందని నివేదిక తెలిపింది.
♦ క్యూ3లో నగరంలో పీఈ కొనుగోళ్లలో కొన్ని.. సింగపూర్‌కు చెందిన షాండర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ గచ్చిబౌలిలో ఆఫీస్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధి కోసం ఫోనిక్స్‌ గ్రూప్‌లో రూ.2,550 కోట్ల పీఈ పెట్టుబడులు పెట్టింది. అలాగే షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ అండ్‌ అలయెన్జ్‌ జాయింట్‌ వెంచర్‌ 23 లక్షల చ.అ. వేవ్‌రాక్‌లో ఆఫీస్‌ పార్క్‌ను కొనుగోలు చేసింది.
♦ మొత్తం పీఈ నిధుల్లో రూ.7,140 కోట్లు ఆఫీసు స్పేస్‌ రియల్టీలోకి వచ్చాయి. వచ్చే త్రైమాసికంలోనూ ఇదే వృద్ధి కనపించే అవకాశాలుంటాయని.. బ్లాక్‌స్టోన్, జీఐసీ, మాప్లేట్రీ ఇన్వెస్ట్‌మెంట్స్, సీపీపీఐబీ వంటి సంస్థలు ముంబై, చెన్నై, హైదరాబాద్‌ల్లోని ఆఫీస్‌ స్పేస్‌ రియల్టీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే అవకాశముందని నివేదిక తెలిపింది.

 



You may be interested

ఒక్క యాప్‌ 18 రకాల సేవలు!

Saturday 10th November 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫుడ్‌ ఆర్డర్‌ కోసం ఒక యాప్‌! బిల్‌ పేమెంట్స్‌ కోసం ఇంకొకటి.. ట్రావెల్, సినిమా టికెట్లకు మరొకటి.. ఇలా ప్రతి దానికో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే బదులు అన్ని రకాల సేవలకూ ఒకే యాప్‌ ఉంటే? ఇదే ఆలోచన వరంగల్‌కు చెందిన ఓ కుర్రాడికి వచ్చింది. అంతే! చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి ‘పబ్బాస్‌’ పేరిట ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యాప్‌ను అభివృద్ధి చేశాడు. ప్రస్తుతం ఏటా 18 లక్షల

భవనం ఎత్తు పెరిగితే?

Saturday 10th November 2018

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో జనాభా పెరుగుతుండటంతో ఐదంతస్తుల భవనాలు సర్వసాధారణమయ్యాయి. పాత భవనాలను కూల్చేసి మరీ కొత్త అపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్న బిల్డర్లున్నారు. వీటికి తోడు 20, 34 అంతస్తుల ఆకాశహర్మ్యాలు సైతం నగరంలో దర్శనమిస్తున్నాయి. వీటిల్లో ఐదంతస్తుల వరకు చ.అ.కు ఒక రకమైన ధర ఉంటే ఆ తర్వాత ప్రతి అంతస్తుకు ధర పెరుగుతుంటుంది. నిర్మాణ వ్యయం పెరుగుతుంది కాబట్టి చ.అ. ధరల్లోనూ మార్పులుంటాయని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. బాల్కనీ నుంచే

Most from this category