STOCKS

News


ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు 6.88% అప్‌

Saturday 13th October 2018
auto-mobiles_main1539410245.png-21117

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు 6.88 శాతం వృద్ధిరేటును నమోదు చేసినట్లు సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌) వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం.. 2018-19 ఆర్థిక సంవత్సర ఏప్రిల్‌–సెప్టెంబరు కాలానికి 17,44,305 యూనిట్లు అమ్ముడవగా.. గతేడాది ఈ కాలంలో 16,32,006 యూనిట్లు అమ్ముడయ్యాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్‌ పెరగడం, నూతన వాహనాల విడుదల కారణంగా 6.88 శాతం వృద్ధి నమోదైందని సియామ్‌ ప్రెసిడెంట్‌ రాజన్‌ వాడెరా అన్నారు. పూర్తి ఆర్థిక ఏడాదికి 9-11 శాతం మధ్య వృద్ధిరేటును అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జూలై–సెప్టెంబరు కాలానికి ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు 3.6 శాతం క్షీణతను నమోదు చేయగా.. గ్రామీణ డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఆరు నెలల్లో విక్రయాలు ఊపందుకోనున్నాయని వ్యాఖ్యానించారు.



You may be interested

ఐపీఓకు ఇమామి సిమెంట్‌ లిమిటెడ్‌

Saturday 13th October 2018

ముంబై:- ఐపీఓ ద్వారా నిధుల సమీకరించేందుకు ఇమామి సిమెంట్‌ లిమిటెడ్‌ కంపెనీ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను శుక్రవారం మార్కెట్‌ నియంత్రణ సంస్థకు సెబి సమర్పించింది. ఈ ఐపీఓ ఇష్యూ ధర కంపెనీ మొత్తం రూ.1000 కోట్లను సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.500 కోట్ల విలువైన షేర్లు తాజా షేర్లను జారీ చేయనుంది. అలాగే ప్రస్తుత ప్రమోటర్లతో పాటు, షేర్‌ హోల్డర్లు సైతం అంతే విలువ కలిగిన

బంధన్ బ్యాంక్‌కు సెబీ ఊరట

Saturday 13th October 2018

ముంబై: ప్రమోటర్ల షేర్‌హోల్డింగ్‌ తగ్గింపు విషయానికి సంబంధించి బంధన్ బ్యాంక్‌కు కొంత ఊరట లభించింది. లిస్టింగ్ తర్వాత ప్రమోటర్లు ఏడాది దాకా వాటాలను విక్రయించకుండా చేసే నిబంధన విషయంలో తమకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి మినహాయింపు లభించినట్లు బ్యాంక్ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్‌ లైసెన్సింగ్ నిబంధనలకు అనుగుణంగా ప్రమోటింగ్ సంస్థ బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ (బీఎఫ్‌హెచ్‌ఎల్‌).. బంధన్ బ్యాంకులో తనకున్న 82 శాతం వాటాలను 40 శాతానికి

Most from this category