STOCKS

News


ఇక రుణదాతలుగా గృహ కొనుగోలుదారులు

Saturday 11th August 2018
news_main1533957985.png-19166

న్యూఢిల్లీ: గృహ కొనుగోలుదారులు ఇకపై సంబంధిత ప్రాజెక్టుకు సంబంధించి రుణ దాతల హోదా పొందనున్నారు. ఈ మేరకు పార్లమెంటు శుక్రవారం ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్ట్సీ కోడ్‌ (ఐబీసీ) 2016కు సవరణను ఆమోదించింది. గృహ ప్రాజెక్టులకు సంబంధించి ప్రస్తుతం బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకే రుణ దాత హోదా ఉంది. ఈ బిల్లుకు లోక్‌సభ జూలై 31వ తేదీనే ఆమోదముద్ర వేసింది. తాజాగా రాజ్యసభ కూడా ఓకే చెప్పడంతో  సవరణ బిల్లుకు  పార్లమెంటు ఆమోదముద్ర వేసినట్లయ్యింది. దివాలా కేసుల సత్వర విచారణకు కూడా తాజా సవరణ బిల్లు దోహదపడుతుదని ఆర్థికశాఖ మంత్రి పియుష్‌ గోయెల్‌ ఎగువ సభకు ఈ సందర్భంగా తెలిపారు. చిన్న తరహా సంస్థల దివాలా ప్రక్రియ పూర్తికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు అలాగే బడా దివాలా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోడానికి ఈ సవరణ బిల్లు దోహదపడుతుందని వెల్లడించారు. ఉదేశపూర్వక ఎగవేతదారులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టంచేసిన మంత్రి వాస్తవంగా సమస్యలను ఎదుర్కొంటున్న కంపెనీలకు కొంత వెసులుబాటు చర్యలు ఉంటాయన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి కోర్టుల సంఖ్య పెంచడానికి కేంద్రం ప్రయత్నం చేస్తోందని మంత్రి తెలిపారు. 


 



You may be interested

గ్రామాల్లో ‘నయాగాడీ’

Saturday 11th August 2018

 వాహనాల డీలర్‌షిప్‌కు ప్రత్యామ్నాయం  బైక్, కారు, ఆటో, ట్రాక్టర్‌ ఏదైనా కొనే వీలు  వాహన రుణం, బీమా, నిర్వహణ సేవలు కూడా  త్వరలో రూ.5 కోట్ల నిధుల సమీకరణ పూర్తి  ‘స్టార్టప్‌ డైరీ’తో నయాగాడీ ఫౌండర్‌ బాలాజీ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టూవీలరైతే ఓకే!! కానీ ట్రాక్టర్ల వంటి భారీ వాహనాల షోరూమ్‌లు ప్రతి గ్రామంలోనూ ఉండాలంటే కష్టమే. స్థలం... పెట్టుబడి... మార్జిన్లు... ఇలాంటివన్నీ దీనిపై ప్రభావం చూపిస్తాయి. ఇదిగో... ఇలాంటి సమస్యలకు చిత్తూరు జిల్లా నగరి

2 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయిన క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్‌ ఐపీఓ

Saturday 11th August 2018

న్యూఢిల్లీ: ​‍క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) 2.22 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. శుక్రవారం ముగిసిన ఈ  ఐపీఓ సైజు రూ.1,131 కోట్లు. ఈ ఐపీఓకు ప్రైస్‌బ్యాండ్‌గా రూ.418-422ను కంపెనీ నిర్ణయించింది. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్ల వాటా 5.5 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా 88 శౠతం చొప్పున సబ్‌స్క్రైబయ్యాయి. ఈ కంపెనీ షేర్లు ఈ నెల 23న స్టాక్‌ మార్కెట్లో లిస్టవుతాయని అంచనా. ఇటీవలనే ఈ  సూక్ష్మ రుణ సంస్థ,

Most from this category