STOCKS

News


పీజీఐఎం నుంచి ఓవర్‌నైట్‌ ఫండ్‌

Wednesday 14th August 2019
personal-finance_main1565760402.png-27751

ఓవర్‌నైట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసే లక్ష్యంతో పీజీఐఎం ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ (లోగడ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా) నుంచి ఓవర్‌నైట్‌ ఫండ్‌ అందుబాటులోకి వచ్చింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకం. ఈ నెల 12న ఆఫర్‌ ప్రారంభం కాగా, ఈ నెల 26 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. ఒక్క రోజు వ్యవధిలో గడువు తీరే ఓవర్‌నైట్‌ సెక్యూరిటీల్లో (డెట్‌ సెక్యూరిటీలు, మనీ మార్కెట్‌ ఇనుస్ట్రుమెంట్లు) ఈ పథకం ఇన్వెస్ట్‌ చేస్తుంది. స్వల్ప కాలం కోసం నిధులను పార్క్‌ చేసుకోవాలనుకునే వారికి ఇది అనుకూలం. రిస్క్‌ తక్కువగా ఉంటుంది. అధిక లిక్విడిటీ (కోరుకున్నప్పుడు వేగంగా వెనక్కి తీసుకోగలగడం) ఇందులోని మరో సానుకూలత. అయితే, రాబడులకు హామీ ఉండదు. ప్రవేశం, వైదొలిగే సమయంలో ఎటువంటి చార్జీలు ఉండవు. ఒక రోజు నుంచి నెల రోజుల వరకు తమ నిధులపై రాబడులు కోరుకునే వారు ఈ తరహా పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. 



You may be interested

కారు.. కుదేలు..

Wednesday 14th August 2019

జూలైలో 19 శాతం పడిపోయిన అమ్మకాలు  19 ఏళ్లలో ఇదే భారీ  క్షీణత 15,000 ఉద్యోగాలకు కోత సియామ్‌ గణాంకాల్లో వెల్లడి ప్యాకేజీ కోసం పరిశ్రమ వర్గాల విజ్ఞప్తి న్యూఢిల్లీ: వాహనాలకు డిమాండ్‌ మందగించడం ఆటోమొబైల్‌ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. జూలైలో వాహన విక్రయాలు ఏకంగా 18.71 శాతం క్షీణించాయి. గడిచిన 19 ఏళ్లలో ఇంత భారీగా అమ్మకాలు పడిపోవడం ఇదే తొలిసారి. ఈ పరిణామాలతో ఆటోమొబైల్‌ రంగంలో ఉద్యోగాల్లో కూడా కోత పడుతోంది.

ప్రపంచవ్యాప్తంగా సెకనుకు 1,000 కప్పులు

Wednesday 14th August 2019

ఇదీ కాంటినెంటల్‌ కాఫీ ప్రత్యేకత ఇక భారత మార్కెట్‌పై ఫోకస్‌ బ్రాండ్‌ ప్రచారకర్తగా నిత్యా మీనన్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:- ప్రైవేట్‌ లేబుల్‌ ఇన్‌స్టాంట్‌ కాఫీ తయారీలో ఉన్న ప్రపంచ దిగ్గజం సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ భారత్‌పై ఫోకస్‌ చేసింది. దేశీయ మార్కెట్‌కు అనుగుణంగా ఇన్‌స్టాంట్‌ కాఫీ, ఫిల్టర్‌ కాఫీ, కాఫీ ప్రీమిక్స్‌ శ్రేణిలో నూతన ఉత్పాదనలను విడుదల చేసింది. రూ.1తో మొదలుకుని విభిన్న ప్యాక్‌లలో వీటిని ప్రవేశపెట్టింది. దక్షిణాదిన పెద్ద ఎత్తున విస్తరించిన తర్వాత

Most from this category