STOCKS

News


60 డాలర్ల పైకి చమురు

Wednesday 14th August 2019
Markets_main1565760013.png-27749

గత సెషన్లో 3 శాతం మేర పెరిగిన చమురు ధరలు బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఉదయం 10.41 సమయానికి 0.85 శాతం తగ్గి బ్యారెల్‌కు 60.78 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 1.10 శాతం తగ్గి బ్యారెల్‌కు 56.47 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. యుఎస్‌ చైనా దిగుమతులపై విధిస్తానన్న టారిఫ్‌ జాబితా నుంచి కొన్ని ఉత్పత్తులను మినహాయించడంతో, వాణిజ్య యుద్ధ భయాలు కొం‍త సరళతరం అయ్యాయనే అంచనాల నేపథ్యంలో చమురు ధరలు మంగళవారం 3 శాతం మేర పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 3.1 శాతం లాభపడి బ్యారెల్‌కు 60.32 డాలర్లకు చేరుకుంది. ఈ బెంచ్‌ మార్కు సూచీ 2019 ఏప్రిల్‌లో గరిష్ఠ స్థాయిని చేరుకున్నాక, 20 శాతం పతనమవడం గమనార్హం. అదే విధంగా డబ్యూటీఐ క్రూడ్‌ 2.5 శాతం పెరిగి 56.31 డాలర్ల వద్దకు చేరుకుంది. చైనా టారీఫ్‌ జాబితా నుంచి కొన్ని ఉత్పత్తులను తొలగిస్తున్నామని యుఎస్‌ వాణిజ్య ప్రతినిధి చెప్పడంతో యుఎస్‌ డాలర్‌ ఇండెక్స్‌, బాండ్‌ ఈల్డ్‌లు పెరిగాయి. 
  ప్రపంచంలోని అతిపెద్ద  ఐపీఓను ప్రారంభించాలనే ప్రణాళికలో భాగంగా సౌదీ అరేబియా ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా సౌదీ ఆరాంకో మూలధన వ్యయంలో 12 శాతం తగ్గుదల కనిపిస్తోందని, ఇది చమురు సరఫరా వృద్ధిపై ప్రభావం చూపనుందని ఏఎన్‌జీ బ్యాంక్‌ ఒక నోట్‌లో పేర్కొంది. చమురు డిమాండ్‌ ఆందోళనలను ఇది కొం‍త వరకు నిలువరించగలదని తెలిపింది. వీటితోపాటు కువైట్‌ తన సొంత చమురు ఉత్పత్తిని ఒప్పందం కుదుర్చుకున్న దాని కంటే తగ్గించుకోవడం కూడా చమురు ధరలకు మద్ధతుగా ఉండగలవు. కానీ పెరుగుతున్న యు.ఎస్. షేల్ ఆయిల్ ఉత్పత్తి ఈ దేశాల ప్రయత్నాలను పరిమితం చేస్తోంది.
యుఎస్‌ ఏడు ప్రధాన షేల్ నిర్మాణాల నుంచి చమురు ఉత్పత్తి, సెప్టెంబరులో రోజుకు 85,000 బారెల్స్ (బీపీడీ) పెరిగి, రికార్డు స్థాయిలో 87.7 లక్షల బీపీడీలకు చేరుకుంటుందని యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. యుఎస్‌-చైనా మధ్య ముదురుతున్న వాణిజ్య యుధ్దం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మందగమనంలోకి నెడుతోందని, ఫలితంగా చమురు డిమాండ్‌ తగ్గుతోందని విశ్లేషకులు తెలిపారు.



You may be interested

ప్రపంచవ్యాప్తంగా సెకనుకు 1,000 కప్పులు

Wednesday 14th August 2019

ఇదీ కాంటినెంటల్‌ కాఫీ ప్రత్యేకత ఇక భారత మార్కెట్‌పై ఫోకస్‌ బ్రాండ్‌ ప్రచారకర్తగా నిత్యా మీనన్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:- ప్రైవేట్‌ లేబుల్‌ ఇన్‌స్టాంట్‌ కాఫీ తయారీలో ఉన్న ప్రపంచ దిగ్గజం సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ భారత్‌పై ఫోకస్‌ చేసింది. దేశీయ మార్కెట్‌కు అనుగుణంగా ఇన్‌స్టాంట్‌ కాఫీ, ఫిల్టర్‌ కాఫీ, కాఫీ ప్రీమిక్స్‌ శ్రేణిలో నూతన ఉత్పాదనలను విడుదల చేసింది. రూ.1తో మొదలుకుని విభిన్న ప్యాక్‌లలో వీటిని ప్రవేశపెట్టింది. దక్షిణాదిన పెద్ద ఎత్తున విస్తరించిన తర్వాత

తగ్గిన ద్రవ్యోల్బణం..బలపడిన రూపీ

Wednesday 14th August 2019

ఇంధన ధరలు తగ్గడంతో జులై నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గి 3.15 శాతంగా నమోదయ్యింది. ఫలితంగా రూపీ డాలర్‌ మారకంలో 47 పైసలు బలపడి బుధవారం ట్రేడింగ్‌లో 70.93 వద్ద ప్రారంభమైంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండడంతో అక్టోబర్‌లో ఆర్‌బీఐ ఇంకోసారి వడ్డీ రేట్లను తగ్గించడానికి వీలు కలుగుతుందని విశ్లేషకులు తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణం 2019 జూన్‌లో 3.18 శాతంగా ఉండగా, గత ఏడాది (జూలై 2018) ఇదే కాలంలో ఇది

Most from this category