STOCKS

News


విలీనాల తర్వాత ఉద్యోగుల తొలగింపుల్లేవ్‌

Saturday 11th August 2018
news_main1533957658.png-19163

న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)తో భారతీయ మహిళా బ్యాంక్‌సహా ఐదు అనుబంధ బ్యాంకుల విలీనం అనంతరం ఉద్యోగులు ఎవరినీ తొలగించలేదని ఆర్థికశాఖ మంత్రి పియూష్‌ గోయెల్‌ పేర్కొన్నారు. 2018 మార్చి 31వ తేదీ నాటికి ఎస్‌బీఐ మొత్తం 1,56,965 మంది ఉద్యోగులను, 1,56,964 మంది అధికారులను కలిగి ఉన్నట్లు మంత్రి లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. బ్యాంకులన్నీ కలిశాక 6,950 బ్రాంచీల విలీనం జరిగిందని తెలిపారు. 



You may be interested

జెట్ ఎయిర్‌వేస్‌ పరిణామాలపై కేంద్రం దృష్టి

Saturday 11th August 2018

న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌పై కేంద్రం దృష్టి సారించింది. కంపెనీ పరిణామాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్‌ చౌబే చెప్పారు. అయితే, కంపెనీ ఆర్థిక ఆడిటింగ్‌ను నిర్వహించే యోచనేదీ లేదని ఆయన స్పష్టం చేశారు. తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించడాన్ని కూడా జెట్ ఎయిర్‌వేస్ వాయిదా వేసిన నేపథ్యంలో చౌబే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సాధారణంగా విమానయాన

యూనియన్‌ బ్యాంకు లాభంలో 12 శాతం వృద్ధి

Saturday 11th August 2018

న్యూఢిల్లీ: యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా జూన్‌ త్రైమాసికానికి సంబంధించి మెరుగైన ఫలితాలను వెల్లడించింది. నికర లాభం 12 శాతం వృద్ధితో రూ.130 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం రూ.9,908 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.116 కోట్లు, ఆదాయం రూ.9,567 కోట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకు వడ్డీ ఆదాయంలో మంచి వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది జూన్‌ క్వార్టర్లో వడ్డీ ఆదాయం రూ.8,112 కోట్లుగా

Most from this category