STOCKS

News


సన్నీ వార్షిక ఎడిషన్ @ రూ.6.99 లక్షలు

Saturday 15th September 2018
auto-mobiles_main1536986976.png-20267

న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమేకర్‌ నిస్సాన్ మిడ్‌-సైజ్‌ సెడాన్‌ సన్నీ వార్షికోత్సవ ఎడిషన్‌ను శుక్రవారం మార్కెట్‌లో విడుదలచేసింది. కారు సాంకేతిక వ్యవస్థ మొత్తాన్ని అనుసందానించే నిస్సాన్‌ కనెక్ట్‌తో కలిపి మొత్తం 50 అధునాతన సాంకేతిక ఫీచర్లు ఈ స్పెషల్‌ ఎడిషన్‌లో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ వేరియంట్లలో విడుదలైన ఈ కారు ధర 6.99 లక్షలు. ‘విశాలమైన ఇంటీరియర్స్, స్మార్ట్‌ టెక్నాలజీ అప్‌డేట్స్‌ కలిగిన సన్నీ వార్షిక ఎడిషన్‌ కస్టమర్ల అభిరుచులకు తగినట్లుగా రూపుదిద్దుకుంది.’ అని సెల్స్‌ డైరెక్టర్‌ హర్దీప్ సింగ్ అన్నారు.



You may be interested

కస్టమర్లకు వాట్సాప్‌లో నోటీసులు!!

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: నిబంధనలను ఉల్లంఘించే ఖాతాదారులకు సంబంధించి కేసులను సత్వరం పరిష్కరించుకునే క్రమంలో ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. వాట్సాప్, ఈమెయిల్స్ ద్వారా కూడా నోటీసులు పంపుతోంది. ఇప్పటిదాకా 250 పైచిలుకు సమన్లను వీటి ద్వారా పంపినట్లు బ్యాంకు అధికారి ఒకరు వెల్లడించారు. వీరిలో ఎక్కువమంది మహారాష్ట్ర, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్‌లకు చెందినవారని చెప్పారు. పోస్ట్ ద్వారా నోటీసులు పంపుతున్నా చాలా మంది కస్టమర్లు

ఆఫ్‌షోర్‌లో రూపీ క్షీణత

Saturday 15th September 2018

ఆఫ్‌షోర్‌ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం రాత్రి 72.11 వద్ద ముగిసింది. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే సోమవారం రూపాయి నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది.  డాలర్‌ మారకంలో పడుతూ వస్తున్న రూపాయి శుక్రవారం కొంత రికవరీ అయ్యింది. దేశీయంగా చూస్తే బుధవారం ముగింపుతో పోల్చితే (గురువారం ఫారెక్స్‌ మార్కెట్‌ సెలవు) 34 పైసలు బలపడి 71.84 వద్ద ముగిసింది. శుక్రవారం రూపాయి ఒక

Most from this category