STOCKS

News


సెన్సెక్స్‌ సరికొత్త రికార్డు

Thursday 12th July 2018
Markets_main1531369188.png-18235

  • 11,000 పాయింట్ల పైన ప్రారంభమైన నిఫ్టీ

ముంబై:- మార్కెట్‌ గురువారం రికార్డ్‌ ర్యాలీతో మొదలైంది. ఆసియా మార్కెట్లు నుంచి అందిన సానుకూల సంకేతాలకు తోడు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్లు ఆశావహంగా ఉండటంతో సూచీలు సరికొత్త రికార్డులకు శ్రీకారం చుడుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచి 158 పాయింట్లు లాభంతో 36424 వద్ద, నిప్టీ 59 పాయింట్లు లాభంతో 11000 పాయింట్లపైన 11,007 వద్ద ట్రేడింగ్‌ను షూరూ చేశాయి. ఆరంభ లాభాలను అందుకున్న సెన్సెక్స్‌ సూచీ ఇంట్రాడేలో 270 పాయింట్లకు పైగా లాభపడి 36540 వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. జనవరిలో ఈ సూచీ 36,443 పాయింట్ల వద్ద నమోదుచేసిన రికార్డును తాజాగా అధిగమించింది. మరో ప్రధాన సూచీ 81 పాయింట్లు లాభపడి 11,029 వద్ద చేరుకుంది. నిఫ్టీ కొత్త రికార్డు నెలకొల్పాలంటే జనవరిలో సాధించిన 11,171 పాయింట్ల గరిష్టస్థాయిని అందుకోవాల్సివుంటుంది. ఉదయం గం.9:40లకు సెన్సెక్స్‌ 224 పాయింట్ల లాభంతో  36,490 వద్ద, నిఫ్టీ 76 పాయింట్ల లాభం‍తో 11,025 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. గురువారంనాటి ట్రేడింగ్‌లో అన్ని రంగాలకు చెందిన షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా అత్యధికంగా బ్యాంకింగ్‌, ఆయిల్‌, మెటల్‌ షేర్లు లాభపడ్డాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే ఆసియాలోని అన్ని మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, గత రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.



You may be interested

19 పైసలు బలపడిన రూపాయి

Thursday 12th July 2018

10 గంటల సమయానికి 68.64 వద్ద ట్రేడింగ్‌ డాలర్‌తో రూపాయి మారకం విలువ గురువారం ఉదయం లాభాలతో మొదలయ్యింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ ఎక్స్ఛేంజ్‌లో 9 గంటల సమయానికి రూపాయి విలువ 19 పైసలు బలపడి 68.58 దగ్గర ప్రారంభమయ్యింది. దేశీయ స్టాక్‌ మార్కె‍ట్‌ రికార్డు స్థాయి లాభాల్లో ప్రారంభంకావడం వల్ల విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరిగి రూపాయి విలువ బలపడిందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు తెలియజేశారు. సెన్సెక్స్‌ జీవితకాల గరిష్టస్థాయికి

వాణిజ్య ఘర్షణలున్నా మార్కెట్లు ముందుకే: ప్రభుదాస్‌

Thursday 12th July 2018

అమెరికా, చైనాలు సుంకాల పోరు మొదలు పెట్టినప్పటికీ, దేశీయ మార్కెట్లు ముందుకే వెళతాయంటోంది ప్రభుదాస్‌ లీలాధర్‌ సంస్థ. మనదేశ ఆర్థిక వృద్ధిపై వీటి ప్రభావం ఉండదని, ఇక్కడి మార్కెట్లు వచ్చే ఆరు నెలల్లో కొత్త స్థాయిలకు చేరతాయని ప్రభుదాస్‌ లీలాధర్‌ సంయుక్త ఎండీ దిలీప్‌ భట్‌ పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఆయన పలు అంశాలపై ఇంటర్వ్యూ ఇచ్చారు.   ప్రశ్న: ఐటీ స్టాక్స్‌ ఈ ఏడాది ప్రారంభం నుంచి మంచి పనితీరు

Most from this category