STOCKS

News


రూపాయి ర్యాలీ: ఐనా ఐటీ షేర్లకు గిరాకీ..!

Friday 15th March 2019
Markets_main1552634209.png-24626

డాలర్‌ మారకంలో రూపాయి భారీ బలపడినప్పటికీ, ఐటీ షేర్ల ర్యాలీ కొనసాగుతుంది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ శుక్రవారం ట్రేడింగ్లో దాదాపు 1.50శాతం లాభపడింది. ఇండెక్స్‌లో అత్యధికంగా 2శాతం లాభపడింది. విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, టాటా ఎలాక్సీ షేర్లు 1.50శాతం పెరిగాయి. అలాగే ఎన్‌ఐఐటీ టెక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు సైతం 1శాతం పెరిగాయి. అలాగే ఇన్ఫీభీమ్‌ షేరు అరశాతం ర్యాలీ చేసింది. మరోవైపు మైండ్‌ ట్రీ 1శాతం, ఓఎఫ్‌ఎస్‌ఎస్‌ షేర్లు అరశాతం క్షీణించాయి. డాలర్‌ మారకంలో రూపాయి గురువారం ఏడున్నర నెలగరిష్టానికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల తగ్గుదల, దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం పెరగడం ఇందుకు కారణమయ్యాయి. రూపాయి బలపడటంతో డాలరు మారకంలో ఆదాయాల్ని ఆర్జించే ఐటీ షేర్లు వరుసగా ఆరు ట్రేడింగ్‌ సెషన్లలోనూ నష్టపోయాయి. అయితే నేటి ట్రేడింగ్‌లో సాదరణ ట్రెండ్‌కు భిన్నంగా ఐటీ షేర్లకు గిరాకీ పెరిగింది. ఆరు రోజుల వరుస పతనం తరువాత అధిక వాల్యూవేషన్‌ కలిగిన ఐటీ షేర్లు కనిష్ట స్థాయిల వద్ద ట్రేడ్‌ అవుతుండటం ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు పురిగొల్పుతోంది. అలాగే నిఫ్టీ ఐటీ సూచీలో వీక్లీ ఆప్షన్స్‌ను ప్రవేశపెడుతున్నట్లు నేషనల్‌ స్టాక్‌ ఎక్చేంజ్‌ ప్రకటన సైతం ఐటీ షేర్లకు డిమాండ్‌ ఏర్పడిందని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. మధ్యా్‌హ్నం గం.12:00లకు  నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ గత ముగింపు(15,260.45)తో పోలిస్తే 1.25శాతం లాభంతో 15,468.70 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అలాగే టీసీఎస్‌ షేరు 2శాతం లాభంతో నిఫ్టీ - 50 సూచీల్లో టాప్‌-5 గెయినర్లలో చివరి స్థానాన్ని దక్కించుకుంది.



You may be interested

గ్లోబల్‌ లిక్విడిటీ కీలకం!

Friday 15th March 2019

మార్కెట్‌ పరుగులకు ఇంధనం కోటక్‌ ఎంఎఫ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హరీశ్‌ కృష్ణన్‌ ఎన్నికల ఫలితాల కన్నా అంతర్జాతీయ లిక్విడిటీ పరిస్థితులే మార్కెట్లకు కీలకాంశమని కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హరీశ్‌ కృష్ణన్‌ చెప్పారు. ప్రస్తుతం అంతా ఎన్నికల ఫలితాలు, ఎర్నింగ్స్‌ సీజన్‌ప ఎక్కువ ఫోకస్‌ పెట్టారని, కానీ నిజానికి వీటి కన్నా లిక్విడిటీ సరళంగా ఉండడమే కీలకమని చెప్పారు. లిక్విడిటీ ప్రవాహానికి అవరోధాలు లేకుండా ప్రపంచ కేంద్ర బ్యాంకులు ఎలాంటి చర్యలు

వరల్డ్‌ టాప్‌ 75 కంపెనీల్లో ఆర్‌ఐఎల్‌

Friday 15th March 2019

ప్రపంచంలో మార్కెట్‌క్యాప్‌ పరంగా టాప్‌ 75 కంపెనీల్లోకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చేరింది. దాదాపు 12300 కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌తో ఆర్‌ఐఎల్‌ ఈ జాబితాలో అడుగు పెట్టింది. ప్రస్తుతం ఈ టాప్‌ 75 కంపెనీల సరాసరి మార్కెట్‌ క్యాప్‌ విలువ 16100 కోట్ల డాలర్లు. గతేడాది కాలంలో ఆర్‌ఐఎల్‌ షేరు దాదాపు 45 శాతం ర్యాలీ జరిపింది. ప్రపంచంలో గతేడాది మంచి రాబడులు ఇచ్చిన టాప్‌ 100 కంపెనీల్లో మూడో

Most from this category