STOCKS

News


ఐటీ షేర్లకు రూపాయి ఝలక్‌

Friday 9th November 2018
Markets_main1541748551.png-21821

డాలర్‌ మారకంలో రూపాయి అనూహ్య రివకరీ ఇంట్రాడేలో ఐటీ షేర్లకు ఝలక్‌ ఇచ్చింది. నేడు ముడి చమురు ధరలు తగ్గడం, బాండ్‌ ఈల్డ్‌ పెరగడం తదితర అంశాలు రూపాయి ర్యాలీకి కారణమయ్యాయి. రూపాయి బలపడంతో డాలర్ల రూపంలో ఆదాయాన్ని ఆర్జించే ఐటీ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈ ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతానికి పైగా నష్టపోయింది. మధ్యాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(14674.45)తో పోలిస్తే దాదాపు 1శాతం నష్టంతో 14,549.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో భాగమైన మొత్తం 10షేర్లలో 4 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, మరో 6 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా ఇన్ఫోసిస్‌ 2.50శాతం నష్టపోయింది. విప్రో 2శాతం, టాటాఎలాక్సీ 1.50శాతం, టీసీఎస్‌, ఎన్‌ఐఐటీటెక్‌, ఓఎఫ్‌ఎస్‌ఎస్‌ షేర్లు 1శాతం నష్టపోయాయి. మరోవైపు ఇదే సూచీలోని ఇన్ఫీభీమ్‌ 13శాతం లాభంతో ట్రేడ్‌ అవుతోంది. మైండ్‌ ట్రీ 3శాతం, టెక్‌మహీంద్రా 1శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ అరశాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 లూజర్లలో ఐటీ రంగ షేర్లైన ఇన్ఫోసిస్‌, విప్రో షేర్లు చోటు దక్కించుకోవడం గమనార్హం.
ఇక మార్కెట్‌ విషయానికొస్తే ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి లాభనష్టాల మధ్య ట్రేడ్‌ అవుతోంది. మిడ్‌ సెషన్‌ సమయానికి సెన్సెక్స్‌ 13 పాయింట్ల నష్టంతో 10,585 వద్ద, సెన్సెక్స్‌ సూచీ 65 పాయింట్ల నష్టంతో 35170 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అత్యధికంగా ఐటీ రంగ షేర్లు లాభపడగా, మెటల్‌ రంగ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

ఫలితాలు చూసి నిపుణులు మెచ్చిన షేర్లు ఇవే..!

Friday 9th November 2018

గడిచిన నెలరోజుల్లో దేశీ సూచీలు 2 శాతానికి మించి లాభాలను సాధించాయి. ప్రత్యేకించి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసిక ఫలితాల వెల్లడి తరువాత సూచీలు భారీ లాభాలను నమోదుచేశాయి. అయితే, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 8 శాతం వరకు లాభపడిన నేపథ్యంలో ప్రధాన ఇండెక్స్‌లు ఫ్రెంట్‌లైన్‌ స్టాక్స్‌ను అవుట్‌పెర్ఫార్మ్‌ చేశాయి. మరోవైపు ఆకర్షణీయమైన విలువ, స్థిర ఆదాయాలు ప్రకటించిన పలు కంపెనీలు ప్రధాన సూచీలను మించి లాభపడ్డాయి.

రిలయన్స్‌పై ఓవర్‌వెయిట్‌తో మోర్గాన్‌ స్టాన్లీ

Friday 9th November 2018

ప్రముఖ గ్లోబల్‌ రీసెర్చ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ తాజాగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై (ఆర్‌ఐఎల్‌) ఓవర్‌వెయిట్‌తో ఉంది. ఆర్‌ఐఎల్‌ స్టాక్‌కు టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,230గా నిర్ణయించింది. కెమికల్‌ వ్యాపారపు మార్జిన్లు పాజిటివ్‌గా ఉండటం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోందని తెలిపింది. ఇక డిమాండ్‌ ఔట్‌లుక్‌ సాధారణంగానే ఉండొచ్చని అంచనా వేసింది.  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుత క్యూ2లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.9,516 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. సీక్వెన్షియల్‌గా చూస్తే 0.6 శాతం వృద్ధి నమోదయ్యింది. పెట్రోకెమికల్‌,

Most from this category