STOCKS

News


11150పై ప్రారంభమైన నిఫ్టీ

Thursday 16th May 2019
Markets_main1557979122.png-25763

ప్రపంచమార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ గురువారం స్వల్ప లాభంతో మొదలైంది.  సెన్సెక్స్‌ 64 పాయింట్లు లాభపడి  37,179 వద్ద నిఫ్టీ 23 పాయింట్లను లాభంతో 11150పైన 11,180 వద్ద ప్రారంభమయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ నీరసిస్తున్న తరణంలో కార్లు, ఆటో విడిభాగాల దిగుమతులపై సుంకాల విధింపును వాయిదా వేసే యోచనలో ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఫలితంగా నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు అమెరికా మార్కెట్లు వరుసగా రెండో లాభాల్లో ముగియగా, నేడు ఆసియా పలు మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. మన మార్కెట్లో నేడు అటో, ఐటీ, మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంజీసీ రియల్టీ రంగ షేర్లలో కొనుగోళ్లు జరుగుతున్నాయి, ఫార్మా, ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు నెలకొన్నాయి. ఏప్రిల్‌ వాణిజ్య లోటు 5నెలల గరిష్టానికి చేరడంతో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 7పైసలు క్షీణించి 70.27 వద్ద ప్రారంభమైంది. మధ్య తూర్పు దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధర వరుసగా మూడురోజూ పెరిగింది. నేడు బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ఫ్యూచర్‌ ధర 72.04డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
బజాజ్‌ ఫైనాన్స్‌, పవర్‌ గ్రిడ్‌, యస్‌బ్యాంక్‌, యూపీఎల్‌, టాటామోటర్స్‌ షేర్లు 1శాతం నుంచి 4శాతం లాభపడగా, ఐషర్‌ మోటర్స్‌, సన్‌ఫార్మా, బీపీసీఎల్‌, ఐఓసీ ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు 1శాతం నుంచి 2శాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 16th May 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు యూనియన్‌ బ్యాంక్‌ ఇండియా:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-20లో రూ.6వేల కోట్ల మూలధన నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మొత్తం మూలధన సమీకరణలో రూ.4,900 కోట్లను ఈక్వీటీ షేర్ల జారీ ద్వారా సమీకరించనుంది. లుపిన్‌:- యూఎస్‌ఎఫ్‌డీఏ మహారాష్ట్రలోని ఔరంగబాద్‌ ప్లాంట్‌లో తనిఖీలు పూర్తి చేసింది. ప్లాంట్‌ నిర్వహణ లోపాల్ని గుర్తించిన యూఎస్‌ఎఫ్‌డీఏ 3 అబ్జర్వేషన్లు జారీ చేసినట్లు ఎక్చే‍్సంజ్‌లకు సమాచారం

మీ పోర్ట్‌ఫోలియోకు హెడ్జింగ్‌ అవసరం

Thursday 16th May 2019

సార్వత్రిక ఎన్నికల చివరిదశ పోలింగ్‌ ఈ నెల 19న ముగిసిన తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ వస్తాయని, దీంతో మార్కెట్లలో ఈ నెల 20 నుంచి ఎక్కువ అస్థిరతలు ఉంటాయన్న అంచనాను హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వ్యక్తం చేసింది. కనుక ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోకు రక్షణగా హెడ్జింగ్‌ చేసుకోవాలని సూచించింది. మనదేశంలో సాధారణ ఎన్నికల పట్ల మార్కెట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్నందున హెడ్జింగ్‌ అవసరమని పేర్కొంది. ఈ మేరకు తాజా నివేదికను విడుదల

Most from this category