STOCKS

News


11250పాయింట్లపై ముగిసిన నిఫ్టీ

Thursday 16th May 2019
Markets_main1558002008.png-25781

  • 278 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌ 
  • కలిసొచ్చిన చివరిగంట కొనుగోళ్లు 

ఒకరోజు నష్టాల ముగింపు తరువాత చివరి గంట కొనుగోళ్లతో మార్కెట్‌ మళ్లీ లాభాల బాట పట్టింది. సెన్సెక్స్‌ 278 పాయింట్లు లాభపడి 37,393 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 100 పాయింట్లు లాభపడి 11250పై 11,257ల వద్ద ముగిసింది. బ్యాంకు నిఫ్టీ 289 పాయింట్లు లాభపడి 28,855.30 వద్ద స్థిరపడింది. ఒక్క ఫార్మా తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు లాభాలతో ముగిశాయి. మెటల్‌ షేర్లలో కొనుగోళ్ల అధికంగా జరిగాయి. 

ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలను అందిపుచ్చుకున్న మార్కెట్‌ నేడు స్వల్ప లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 64 పాయింట్లు లాభపడి  37,179 వద్ద నిఫ్టీ 23 పాయింట్లను లాభంతో 11150పైన 11,180 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు వరుసగా మూడోరోజూ పెరగడం, వాణిజ్య లోటు గణాంకాలు 5నెలల గరిష్టానికి చేరుకోవడంతో పాటు డాలర్‌ మారకంలో రూపాయి రూపాయి బలహీనపడటం తదితర ప్రతికూలాంశాలతో మార్కెట్‌ మిడ్‌సెషన్‌ వరకు స్తబ్దుగా ట్రేడైంది. ఒకదశలో సెన్సెక్స్‌ 63 పాయింట్లను నష్టపోయి 37,052.30 వద్ద, నిఫ్టీ 14 పాయింట్లను నష్టపోయి 11,143.35 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. 

మిడ్‌సెషన్ అనంతరం యూరప్‌ మార్కెట్లు మిశ్రమ ప్రారంభంతో పాటు రూపాయి 30పైసల రికవరీ మార్కెట్‌ సెంటిమెంట్‌ బలపడేందుకు తోడ్పడ్డాయి. వీటికి తోడు చివరి గంటలో దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సూచీలను పరుగులు పెట్టించాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 404  పాయింట్లు లాభపడి 37,519 వద్ద, నిఫ్టీ 124 పాయింట్ల పెరగి 11,281ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి.  

ఆల్ట్రాటెక్‌, ఐఓసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, బీపీసీఎల్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 4శాతం నుంచి 9శాతం లాభపడగా, కోల్‌ ఇండియా, సిప్లా, ఇండస్‌ ఇండ్‌, భారతీఎయిర్‌టెల్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం నుంచి 3.50శాతం నష్టపోయాయి. 



You may be interested

అమ్మో.. ఆప్షన్స్‌!

Thursday 16th May 2019

భారీగా ఉన్న కాల్‌, పుట్‌ ధరలు అధిక ప్రీమియంతో ట్రేడవుతున్నఇండెక్స్‌ ఆప్షన్లు బాగా తగ్గిన ఆప్షన్‌ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ సాధారణంగా ఒక ఈవెంట్‌ జరిగే సమయంలో మార్కెట్లో వచ్చే తీవ్ర కదలికలు ఆప్షన్‌ ట్రేడర్లకు లాభాలనిస్తుంటాయి. అందుకే ఎఫ్‌అండ్‌ఓ ట్రేడ్‌ చేసేవారు పెద్ద ఈవెంట్‌ సమయంలో భారీ లాభాల కోసం ఆప్షన్స్‌ను ఎంచుకుంటారు. కానీ ఈ దఫా ఇలాంటి ట్రేడర్లకు పెద్దగా ప్రయోజనం ఉండేలా కనిపించడం లేదు. సాధారణంగా నెల మధ్యకు వచ్చే సరికి

హిండాల్కో లాభంలో 18 శాతం క్షీణత

Thursday 16th May 2019

మార్చి త్రైమాసికానికి హిండాల్కో ఇండస్ట్రీస్‌ నికర లాభం 17.9 శాతం క్షీణించి రూ. 506 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ 616 కోట్ల రూపాయల లాభం నమోదు చేసింది.  ఉత్కల్‌ ఆపరేషన్లను మినహాయించి లెక్కిస్తే స్టాండలోన్‌ నికరలాభం 37.4 శాతం పతనమై రూ. 377 కోట్ల నుంచి రూ. 236 కోట్లను చేరింది.  సమీక్షా కాలంలో రెవెన్యూ రూ. 11687 కోట్ల నుంచి రూ. 12455 కోట్లకు

Most from this category