బ్యాంక్ నిఫ్టీ 3శాతం అప్
By Sakshi

మార్కెట్ రికవరీలో భాగంగా గురువారం బ్యాకింగ్ షేర్లు భారీగా లాభాపడ్డాయి. ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ ఇంట్రాడేలో 3శాతం లాభపడింది. నేడు నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 25000ల పైన ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో పలు బ్యాంకింగ్ షేర్ల ర్యాలీ కారణంగా నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 3శాతం లాభపడి 25,484 గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్ గత ముగింపు(24,784)తో పోలిస్తే 2.66శాతం లాభంతో 25,443.25 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి ఈ ఇండెక్స్‌లో భాగమైన మొత్తం 12 షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అత్యధికంగా యస్ బ్యాంక్ 4.50శాతం లాభపడింది. ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, పీఎన్బీ, ఇండక్ ఇండ్ బ్యాంక్ షేర్లు 3శాతం పెరిగాయి. అలాగే ఫెడరల్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ షేర్లు 2శాతం లాభపడగా, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ షేర్లు 1.50శాతం నుంచి 1శాతం వరకు ర్యాలీ చేశాయి.
You may be interested
మార్కెట్లో ముందే ‘దీపావళి’
Friday 12th October 2018ఇండియన్ ఈక్విటీ మార్కెట్.. ఇన్వెస్టర్ల కోసం దీపావళిని ముందే తీసుకువచ్చిందంటున్నారు మోర్గాన్ స్టాన్లీ ఇండియా ఎండీ రిధమ్ దేశాయ్. ఖరీదైన స్టాక్స్ చౌకగా లభ్యమౌతున్నాయని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లోని ఒడిదుడుకులు దీర్ఘకాల ఇన్వెస్టర్లకు మంచి అవకాశాలను అందిస్తున్నాయని తెలిపారు. కాగా ఆగస్ట్ నుంచి చూస్తే సెన్సెక్స్, నిఫ్టీ ఇండెక్స్‌లు 12 శాతానికిపైగా పతనమయ్యాయి. రూపాయి క్షీణత, క్రూడ్
యస్ బ్యాంక్ చీఫ్ అప్డేట్.. షేరు 4%అప్
Friday 12th October 2018ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ చీఫ్ వెతుకులాటలో ఒక అప్డేట్ వెలువడింది. బ్యాంక్ కొత్త ఎండీ, సీఈవో ఎంపికలో సెర్చ్ అండ్ సెలెక్షన్ కమిటీకి సాయమందించేందుకు యస్ బ్యాంక్ తాజాగా అమెరికాకు చెందిన అడ్వైజరీ సంస్థ ‘కార్న్ ఫెర్రీ’ను నియమించుకుంది. యస్ బ్యాంక్‌కు నాలుగు గ్లోబల్ లీడర్షిప్ అడ్వైజరీ సంస్థల నుంచి ప్రతిపాదనలు అందాయి. గురువారం జరిగిన సమావేశంలో బ్యాంక్ వీటిల్లోంచి కార్న్ ఫెర్రీని ఎంపిక చేసుకుంది. కాగా ఆర్బీఐ..