STOCKS

News


స్వల్ప లాభంతో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌

Friday 9th November 2018
Markets_main1541746305.png-21819

మార్కెట్‌ ఫ్లాట్‌ ట్రేడింగ్‌లో భాగంగా శుక్రవారం నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ కూడా స్వల్పంగా లాభపడింది. నేడు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 25,742.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు నష్టాల్లో ట్రేడ్‌ అయిన్పటికీ, హెవీ వెయిటేజీ షేర్లైన యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ షేర్ల ర్యాలీ బ్యాంక్‌ నిప్టీ ఇండెక్స్‌ మాత్రం లాభాల్లో ట్రేడైంది. ఇంట్రాడేలో అరశాతం లాభపడి 25807 స్థాయిని అందుకుంది. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(25,737.50)తో పోలిస్తే 0.20శాతం స్వల్ప లాభంతో 25,778.90ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  ఇదే సమయానికి సూచీలో మొత్తం 12 షేర్లకు గానూ 9 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 3షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. యస్‌ బ్యాంక్‌ అత్యధికంగా 4.75శాతం లాభపడింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 1.50శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 1శాతం ర్యాలీ చేశాయి. వాటితో పాటు ఫెడరల్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి.



You may be interested

రిలయన్స్‌పై ఓవర్‌వెయిట్‌తో మోర్గాన్‌ స్టాన్లీ

Friday 9th November 2018

ప్రముఖ గ్లోబల్‌ రీసెర్చ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ తాజాగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై (ఆర్‌ఐఎల్‌) ఓవర్‌వెయిట్‌తో ఉంది. ఆర్‌ఐఎల్‌ స్టాక్‌కు టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,230గా నిర్ణయించింది. కెమికల్‌ వ్యాపారపు మార్జిన్లు పాజిటివ్‌గా ఉండటం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోందని తెలిపింది. ఇక డిమాండ్‌ ఔట్‌లుక్‌ సాధారణంగానే ఉండొచ్చని అంచనా వేసింది.  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుత క్యూ2లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.9,516 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. సీక్వెన్షియల్‌గా చూస్తే 0.6 శాతం వృద్ధి నమోదయ్యింది. పెట్రోకెమికల్‌,

మూడీస్‌ వాచ్‌లిస్ట్‌లో ఎయిర్‌టెల్‌.. షేరు 5% డౌన్‌

Friday 9th November 2018

దేశీ ప్రముఖ టెలికం ఆపరేటర్‌ భారతీ ఎయిర్‌టెల్‌పై హాంగ్‌ కాంగ్‌కు చెందిన మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ ప్రధానంగా దృష్టి పెట్టింది. భారతీ ఎయిర్‌టెల్‌ని రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ వాచ్‌లిస్ట్‌లో ఉంచింది. అంటే కంపెనీ పనితీరు సంతృప్తికరంగా లేకపోతే రేటింగ్‌లో కోత విధిస్తుంది. లాభదాయకత తక్కువ స్థాయిల్లో ఉండటం, క్యాష్‌ఫ్లో బలహీనంగా ఉండొచ్చనే అంచనాలు ఇందుకు కారణమని మూడీస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, సీనియర్‌ క్రెడిట్‌ ఆఫీసర్‌ అన్నాలిసా డిచియరా తెలిపారు. తీవ్రమైన

Most from this category