STOCKS

News


ఎన్‌హెచ్‌పీసీ చేతికి ల్యాంకో తీస్తా ప్రాజెక్ట్‌  !

Friday 7th December 2018
news_main1544161660.png-22724

న్యూఢిల్లీ: ల్యాంకో తీస్తా హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వ రంగ కంపెనీ ఎన్‌హెచ్‌పీసీ చేజిక్కించుకుంది. భారీ రుణ భారంతో కుదేలైన ల్యాంకోకు చెందిన ఈ 500 మెగావాట్ల ప్రాజెక్ట్‌ను దివాలా ప్రక్రియలో భాగంగా ఎన్‌హెచ్‌పీసీ కొనుగోలు చేసింది. ఈ ప్రాజెక్ట్‌ తాత్కాలిక విలువను రూ.900 కోట్లుగా మదింపు చేశారు.  సిక్కిమ్‌లోని తీస్తా నదిపై నిర్మాణమవుతున్న  ఈ ప్రాజెక్ట్‌ను ఎన్‌హెచ్‌పీసీ మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తిగా టేకోవర్‌ చేస్తుందని అంచనా. ఈ టేకోవర్‌కు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) తుది ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌ దాదాపు సగం పూర్తయిందని, మొత్తం పూర్తికావడానికి మూడు నుంచి నాలుగేళ్లు పడుతుందని అంచనా.



You may be interested

నాలుగేళ్లలో... 5జీ!

Friday 7th December 2018

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 5జీ టెలికం సర్వీసులపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో 2022 నాటికల్లా దేశీయంగా కూడా ఈ సర్వీసులు ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నట్లు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కార్యదర్శి ఎస్‌.కె.గుప్తా చెప్పారు. ఆ పై ఐదేళ్లలో డిజిటల్ మాధ్యమం మరింతగా అందుబాటులోకి వస్తుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, బిగ్ డేటా అనలిటిక్స్ వంటివి వినియోగదారుల ధోరణుల్లో మార్పులు తేగలవని గుప్తా చెప్పారు. ‘‘కొన్నాళ్లుగా మీడియా పరిశ్రమలో నాటకీయ మార్పులు

ఆర్‌ఈసీలో వాటాల విక్రయానికి ఓకే

Friday 7th December 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలో మరిన్ని సంస్థల విలీనాలకు తెరతీస్తూ ఆర్ఈసీలో వాటాల విక్రయ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు (పీఎఫ్‌సీ) మొత్తం 52.63 శాతం వాటాలను విక్రయించనుంది. గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. ఈ డీల్‌ ద్వారా ఖజానాకు సుమారు రూ.15,000 కోట్లు దఖలు పడనున్నాయి. వాస్తవానికి ఆర్‌ఈసీకే పీఎఫ్‌సీలో వాటాలను విక్రయించాలని ముందుగా

Most from this category