STOCKS

News


విద్యుత్‌ రంగంలోకి నెట్‌లింక్స్‌

Saturday 10th November 2018
news_main1541827721.png-21840

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఇంటర్నెట్‌ సర్వీసుల కంపెనీ నెట్‌లింక్స్‌ తాజాగా విద్యుత్‌ రంగంలోకి ప్రవేశించింది. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర గ్రీన్‌ పవర్‌ ప్రాజెక్ట్స్‌లో (ఎస్‌వీ గ్రీన్‌) 40 శాతం వాటాను కొనుగోలు చేసింది. హైదరాబాద్‌ సమీపంలోని ఫార్మా సిటీ వద్ద వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 12 మెగావాట్ల పవర్‌ ప్రాజెక్టును ఎస్‌వీ గ్రీన్‌ ఏర్పాటు చేస్తోంది. ప్రాజెక్టు వ్యయం రూ.258 కోట్లు. ఇందులో ఈక్విటీ వాటా రూ.78 కోట్లు. జపాన్‌కు చెందిన టకరా లెబెన్‌, కుని ఉమి అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు ఈక్విటీలో 30 శాతం పెట్టుబడి చేస్తున్నాయి. విద్యుత్‌ ప్లాంటు 18 నెలల్లో సిద్ధం అవుతుందని నెట్‌లింక్స్‌ చైర్మన్‌ మనోహర్‌ లోక రెడ్డి శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. భవిష్యత్‌లో నెలకొల్పే విద్యుత్‌ ప్రాజెక్టులకు సైతం ఈ రెండు జపాన్‌ కంపెనీలు పెట్టుబడి పెడతాయని చెప్పారు.You may be interested

మోల్డ్‌టెక్‌ ప్యాకేజింగ్‌ లాభం రూ.7 కోట్లు

Saturday 10th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: సెప్టెంబరు క్వార్టరు కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో మోల్డ్‌టెక్‌ ప్యాకేజింగ్‌ నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే స్వల్పంగా పెరిగి రూ.7.2 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.79 కోట్ల నుంచి రూ.101 కోట్లకు ఎగసింది. మోల్డ్‌టెక్‌ టెక్నాలజీస్‌ రూ.23 కోట్ల టర్నోవరుపై రూ.2.6 కోట్ల నికరలాభం పొందింది.   

టైటాన్‌ నికర లాభం రూ.301 కోట్లు

Saturday 10th November 2018

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్‌​ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.301 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత క్యూ2లో రూ.278 కోట్ల నికర లాభం వచ్చిందని, ఈ క్యూ2లో 8 శాతం వృద్ధి సాధించామని టైటాన్‌ కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,603 కోట్ల నుంచి రూ.4,595 కోట్లకు పెరగిందని టైటాన్‌ సీఎమ్‌డీ భాస్కర్‌ భట్‌ చెప్పారు. జ్యుయలరీ విభాగం ఆదాయం 29

Most from this category