ల్యాంకో కేసులో మరో 16 రోజుల గడువు
By Sakshi

హైదరాబాద్: అప్పుల ఊబిలో ఉన్న ల్యాంకో ఇన్ఫ్రాటెక్ దివాళా ప్రక్రియలో భాగంగా త్రివేణి నూతన ప్రతిపాదనను పరిశీలించేందుకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ 16 రోజుల గడువు ఇచ్చింది. తమిళనాడుకు చెందిన త్రివేణి ఎర్త్‌మూవర్స్ నూతన పరిష్కార ప్రణాళికను అధ్యయనం చేసేందుకు 270 రోజుల గడువు ఇవ్వాల్సిందిగా మధ్యంతర పరిష్కార నిపుణులు ఎన్సీఎల్టీని కోరారు. అయితే ఎన్సీఎల్టీ బెంచ్ 16 రోజుల గడువు మాత్రమే ఇచ్చింది. త్రివేణి తాజా ప్రతిపాదనపై కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ నిర్దేశిత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని ఎన్సీఎల్టీ ఆదేశించింది. ఐడీబీఐ నేతృత్వంలోని రుణదాతలకు ల్యాంకో ఇన్ఫ్రాటెక్ రూ.44,000 కోట్లు బకాయి పడింది.
You may be interested
ఇన్పోసిస్ 1:1 బోనస్
Friday 13th July 2018ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా 1:1 బోనస్‌ను ప్రకటించింది. ఈ కంపెనీ ఈ క్యూ1లో రూ.3,612 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం (రూ.3,483 కోట్లు)తో పోల్చితే 4 శాతం వృద్ధి సాధించామని ఇన్ఫోసిస్ తెలిపింది. అయితే అంతకు ముందటి క్వార్టర్(గత
ఐహెచ్‌హెచ్ చేతికే ఫోర్టిస్..
Friday 13th July 2018న్యూఢిల్లీ: దేశీయంగా రెండో అతిపెద్ద హాస్పిటల్ చెయిన్ 'ఫోర్టిస్ హెల్త్‌కేర్' టేకోవర్ కోసం నెలల తరబడి వివిధ సంస్థల మధ్య కొనసాగిన యుద్ధం ఎట్టకేలకు ముగిసింది. మలేషియాకి చెందిన ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ ప్రతిపాదనను ఆమోదించినట్లు ఫోర్టిస్ బోర్డు వెల్లడించింది. టేకోవర్ ప్రతిపాదన ప్రకారం ప్రిఫరెన్షియల్ షేర్ల కొనుగోలు ద్వారా రూ. 4,000 కోట్లు సమకూర్చాల్సి ఉంటుంది. షేరు ఒక్కింటికి రూ. 170 చొప్పున ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా ఫోర్టిస్‌లో ఐహెచ్‌హెచ్‌కి