STOCKS

News


టాటా స్టీల్‌కు భూషణ్‌ స్టీల్‌ను విక్రయించొచ్చు

Saturday 11th August 2018
news_main1533957446.png-19161

న్యూఢిల్లీ: దివాలా పరిష్కార చర్యల్లో భాగంగా భూషణ్‌ స్టీల్‌ను టాటా స్టీల్‌కు విక్రయించాలన్న నిర్ణయాన్ని జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) సమర్థించింది. ఐబీసీ చట్టంలోని సెక్షన్‌ 29ఏ ప్రకారం కంపెనీ కొనుగోలుకు బిడ్‌ వేసే అర్హత టాటా స్టీల్‌కు లేదన్న భూషన్‌ స్టీల్‌ ప్రమోటర్‌ నీరజ్‌ సింఘాల్‌ వాదనను తోసిపుచ్చింది. ‘‘టాటా స్టీల్‌ విదేశీ సబ్సిడరీ అయిన టాటా స్టీల్‌ యూకేకు బ్రిటన్‌ కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిమానా విధించింది. అయితే ఈ సెక‌్షన్‌ కింద 12 నెలలకు మించకుండా జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. కానీ, దివాలా చట్టంలోని సెక్షన్‌ 29ఏ (డి) మాత్రం రెండేళ్లు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించతగిన నేరం కింద దోషిగా నిర్ధారణ అయితే బిడ్‌ వేసేందుకు అనర్హులుగా చెబుతోంది’’ అని అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ పేర్కొంది. దీంతో సెక్షన్‌ 29ఏ కింద టాటా స్టీల్‌ అనర్హతకు గురికాబోదని తేల్చి చెప్పింది. ఇక భూషణ్‌ స్టీల్‌కు వ్యాపారపరమైన రుణ సర్దుబాటు (సరుకులు, మెషినరీ సరఫరా) చేసిన ఎల్‌అండ్‌టీ, టాటాస్టీల్‌ పరిష్కార ప్రణాళికను తోసిపుచ్చుతూ తమ బకాయిలను అధిక ప్రాధాన్యం కింద తీర్చివేసేందుకు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. దీన్ని కూడా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ తిరస్కరించింది. ఎల్‌అండ్‌టీ బకాయిలకు టాటా స్టీల్‌ రూ.1,200 కోట్లు కేటాయించిందని, ఇంతకంటే అధిక ప్రాధాన్యం ఆమోదించేది లేదని స్పష్టం చేసింది. 



You may be interested

యూనియన్‌ బ్యాంకు లాభంలో 12 శాతం వృద్ధి

Saturday 11th August 2018

న్యూఢిల్లీ: యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా జూన్‌ త్రైమాసికానికి సంబంధించి మెరుగైన ఫలితాలను వెల్లడించింది. నికర లాభం 12 శాతం వృద్ధితో రూ.130 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం రూ.9,908 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.116 కోట్లు, ఆదాయం రూ.9,567 కోట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకు వడ్డీ ఆదాయంలో మంచి వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది జూన్‌ క్వార్టర్లో వడ్డీ ఆదాయం రూ.8,112 కోట్లుగా

పారిశ్రామిక రంగం పరుగు

Saturday 11th August 2018

న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం జూన్‌లో పరుగు పెట్టింది. సంబంధిత సమీక్షా నెలలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 7 శాతంగా నమోదయ్యింది. మే నెలలో ఈ రేటు 3.9 శాతంకాగా, 2017 జూన్‌లో వృద్ధి అసలు లేకపోగా, -0.3 శాతం క్షీణత నమోదయ్యింది. సూచీలో దాదాపు 77 శాతంగా ఉన్న తయారీతోపాటు మైనింగ్‌, విద్యుత్‌ రంగాల నుంచి మెరుగైన ఉత్పత్తి జూన్‌లో మంచి వృద్ధి ఫలితానికి దారితీసింది.

Most from this category