STOCKS

News


షేర్ల బైబ్యాక్‌కు నాల్కో బోర్డ్‌ ఆమోదం

Saturday 13th October 2018
Markets_main1539410365.png-21119

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ నేషనల్‌ అల్యూమినియమ్‌ కంపెనీ(నాల్కో) రూ.504.8 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేయనున్నది. ఈ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు శుక్రవారం జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని నాల్కో పేర్కొంది. షేర్ల బైబ్యాక్‌లో భాగంగా ఒక్కో షేర్‌ ధరను రూ.75 చొప్పున 6,73,11,386 షేర్లకు మించకుండా షేర్లను బైబ్యాక్‌ చేస్తామని వివరించింది. కాగా ఈ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఐదు రెట్లు పెరిగి రూ.687 కోట్లకు పెరిగింది. షేర్ల బైబ్యాక్‌కు సంబంధించిన డైరెక్టర్ల మీటింగ్‌ నేపథ్యంలో బీఎస్‌ఈలో నాల్కో షేర్‌ స్వల్పంగా లాభపడి రూ.66.95 వద్ద ముగిసింది. 
 



You may be interested

కర్నాటక బ్యాంక్‌ లాభం 20 శాతం అప్‌

Saturday 13th October 2018

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగంలోని కర్నాటక బ్యాంక్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 20 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.93 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.112 కోట్లకు పెరిగిందని కర్నాటక బ్యాంక్‌ తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు తక్కువగా ఉండటం, కీలక ఆదాయం బాగా ఉండటం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కర్నాటక బ్యాంక్‌​ ఎమ్‌డీ,

ఐపీఓకు ఇమామి సిమెంట్‌ లిమిటెడ్‌

Saturday 13th October 2018

ముంబై:- ఐపీఓ ద్వారా నిధుల సమీకరించేందుకు ఇమామి సిమెంట్‌ లిమిటెడ్‌ కంపెనీ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను శుక్రవారం మార్కెట్‌ నియంత్రణ సంస్థకు సెబి సమర్పించింది. ఈ ఐపీఓ ఇష్యూ ధర కంపెనీ మొత్తం రూ.1000 కోట్లను సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.500 కోట్ల విలువైన షేర్లు తాజా షేర్లను జారీ చేయనుంది. అలాగే ప్రస్తుత ప్రమోటర్లతో పాటు, షేర్‌ హోల్డర్లు సైతం అంతే విలువ కలిగిన

Most from this category