STOCKS

News


రూ.150 కోట్లతో ఎంఎస్‌ఆర్‌ కాపర్‌ కొత్త ప్లాంటు

Friday 9th November 2018
news_main1541740371.png-21808

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: డాక్టర్‌ కాపర్‌ పేరుతో రాగి వాటర్‌ బాటిళ్ల తయారీలో ఉన్న ఎంఎస్‌ఆర్‌ కాపర్‌ లిమిటెడ్‌ (గతంలో ఎంఎస్‌ఆర్‌ ఇండియా)... భారీ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. రూ.150 కోట్ల వ్యయంతో హైదరాబాద్‌ సమీపంలోని దుండిగల్‌ వద్ద ఏర్పాటు చేసే ఈ ప్లాంటు తయారీ సామర్థ్యం నెలకు 600 టన్నులు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో తీర్చిదిద్దుతున్న ఈ ఫ్యాక్టరీలో నవంబరు చివరికల్లా ఉత్పత్తి ప్రారంభవుతుందని, వైర్లు, రాగి ఉత్పత్తులు, విద్యుత్‌ పరికరాల వంటి 25 రకాలను ఇక్కడ తయారు చేస్తామని ఎంఎస్‌ఆర్‌ కాపర్‌ ఎండీ కె.వి.రాజశేఖర్‌ రెడ్డి ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఫ్యాక్టరీకి కావాల్సిన నిధులను అంతర్గత వనరుల ద్వారా సమకూరుస్తున్నట్టు తెలియజేశారు.
నెలకు 10 లక్షల బాటిళ్లు..
ప్రస్తుతం కంపెనీ నెలకు 1.5- 2 లక్షల డాక్టర్‌ కాపర్‌ బాటిళ్లను విక్రయిస్తోంది. భారత్‌లో దక్షిణాదిన ఇవి అందుబాటులో ఉన్నాయి. యూఎస్‌, సింగపూర్‌, మలేషియా, దుబాయి, కెన్యాలో సైతం విక్రయిస్తోంది. నూతన ప్లాంటు రాకతో ఉత్పత్తి సామర్థ్యం నెలకు 10 లక్షల యూనిట్లకు చేరుతుంది. దీంతో కొత్త మార్కెట్లలో అడుగు పెడతామని కంపెనీ తెలిపింది. డిసెంబరు నుంచి ఉత్తరాది మార్కెట్లకు సరఫరా చేయనున్నారు. అలాగే ఆస్ట్రేలియా, యూరప్‌కు ఎగుమతి చేస్తామని, బాటిళ్ల విక్రయాల్లో ఎగుమతుల వాటా 20 శాతం ఉందని రాజశేఖర్‌ చెప్పారు.
రెండింతల టర్నోవర్‌..
ఎంఎస్‌ఆర్‌ కాపర్‌ గత ఆర్థిక సంవత్సరంలో రూ.140 కోట్ల టర్నోవర్‌ నమోదు చేసింది. 2018-19లో రూ.250- 300 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టు రాజశేఖర్‌ వెల్లడించారు. ‘‘కొత్త ప్లాంటులో ఉత్పత్తి నవంబరు చివరి నాటికి 50 శాతం, డిసెంబరులో 100 శాతానికి చేరుకుంటుంది. డాక్టర్‌ కాపర్‌కు డిమాండ్‌ అంతకంతకూ పెరుగుతోంది. కంపెనీ తయారు చేస్తున్న ఇతర ఫుడ్‌ ప్రొడక్టులకు మంచి ఆదరణ లభిస్తోంది. నూతన మార్కెట్లలో విస్తరిస్తాం. కాపర్‌ ఉత్పత్తుల ద్వారానే నెలకు రూ.40 కోట్ల వరకు ఆదాయం ఆశిస్తున్నాం. కొత్త ఫ్యాక్టరీతో 400 మందికి ఉపాధి లభిస్తుంది’’ అని వివరించారు.

 You may be interested

ఎమ్‌ఆర్‌ఎఫ్‌ లాభం రూ.263 కోట్లు

Friday 9th November 2018

న్యూఢిల్లీ: టైర్ల కంపెనీ ఎమ్‌ఆర్‌ఎఫ్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో 12 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.300 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.263 కోట్లకు తగ్గిందని ఎమ్‌ఆర్‌ఎఫ్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.3,660 కోట్ల నుంచి 9 శాతం పెరిగి రూ.4,005 కోట్లకు చేరింది. ఒక్కో షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొంది. మూరత్‌ ట్రేడింగ్‌లో భాగంగా

స్మార్ట్‌ టీవీలదే హవా

Friday 9th November 2018

న్యూఢిల్లీ: స్మార్ట్‌ హంగులతో ఉన్న టెలివిజన్లకు వినియోగదారుల ఆదరణ పెరుగుతోంది. అక్టోబర్లో దేశవ్యాప్తంగా జరిగిన టీవీల అమ్మకాల్లో 55 శాతం వాటా స్మార్ట్‌ టీవీలదే. పెద్ద పట్టణాల్లో అయితే స్మార్ట్‌ టీవీల విక్రయాలు 65 శాతం. క్రితం ఏడాది ఇదే మాసంలో స్మార్ట్‌ టీవీల అమ్మకాలు 45 శాతంగానే ఉండడం గమనార్హం. ఇంటర్నెట్‌తో అనుసంధానమనేది స్మార్ట్‌ టీవీకి అదనపు ఆకర్షణగా మారింది. బ్రాడ్‌ బ్యాండ్‌ అందుబాటు ధరల్లోకి రావడం స్మార్ట్‌

Most from this category