STOCKS

News


ఆరు షేర్లపై మోర్గాన్‌స్టాన్లీ ఓవర్‌వెయిట్‌

Friday 14th June 2019
Markets_main1560508777.png-26301

దేశీయ మార్కెట్లో ఆరు స్టాకులపై ఓవర్‌వెయిట్‌గా ఉన్నట్లు దిగ్గజ బ్రోకింగ్‌ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ తెలిపింది.
1. జుబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్‌: టార్గెట్‌ రూ. 1525. డొమినాస్‌ పిజ్జామేకరైన ఈ సంస్థ లాంగ్‌టర్మ్‌ వృద్ధిపై ధీమాగా ఉంది.వ్యయ నియంత్రణకు సాంకేతికాభివృద్ధిని వినియోగిస్తోంది. బంగ్లాదేశ్‌లో విస్తరణపై నమ్మకంగా ఉంది.
2. యాక్సిస్‌బ్యాంక్‌: టార్గెట్‌ రూ. 1100. దేశీయ వృద్ధి బలంగా 15- 18 శాతం వరకు ఉండొచ్చు. కాస్ట్‌ రేషియో మెరుగుదల సరైన దిశలోనే ఉంది. వచ్చే మూడేళ్లలో బలమైన ఆర్‌ఓఈని ఆశిస్తోంది.
3. కోటక్‌మహీంద్రా బ్యాంక్‌: టార్గెట్‌ రూ. 1600. లోన్‌గ్రోత్‌ 20 శాతంగా ఉంటుందని అంచనా. నాన్‌కోర్‌ ఆస్తుల కొనుగోలుకు తయారుగా ఉంది. అసెట్‌క్వాలిటీ బలంగా కనిపిస్తోంది. 
4. ఓల్టాస్‌: టార్గెట్‌ రూ. 705. ఏసీ మార్కెట్‌ పాజిటివ్‌గా ఉంది. కంపెనీ కొత్తగా దక్షిణాదిన ఉత్పత్తి యూనిట్‌ ఆరంభించాలనుకుంటోంది. ఇది కార్యరూపం దాలిస్తే మరింత కలిసివస్తుంది.
5. ఐసీఐసీఐ బ్యాంక్‌: టార్గెట్‌ రూ. 625. ఈ ఆర్థిక సంవత్సరం క్రెడిట్‌కాస్ట్‌ అంచనాలను అందుకుంటామని ధీమాగా ఉంది. దీంతో పాటు ఆస్తుల నాణ్యత మెరుగుపడుతుందని భరోసాగా ఉంది. రిటైల్‌ లెండింగ్‌పై ఎక్కువ ఫోకస్‌ చేయనుంది. 
6. ఎల్‌అండ్‌టీ: టార్గెట్‌ రూ. 1786. మైండ్‌ట్రీ సొంతం చేసుకోవడంతో ఆదాయాలు పెరుగుతాయని, వ్యయాలు కలిసివస్తాయని కంపెనీ భావిస్తోంది. ఇన్‌ఫ్రాపై వ్యయాలు పెంచాలని ప్రభుత్వం భావించడం కలిసివచ్చే అంశం. 



You may be interested

ఈ స్టాకులపై ఎంఎఫ్‌ల ఆసక్తి

Friday 14th June 2019

ఎన్‌డీఏ ప్రభుత్వం రెండో దఫా పాలనా కాలంలో ఇన్‌ఫ్రాపై వ్యయాలు పెంచుతుందన్న అంచనాలున్నాయి. దీంతో అసెట్‌మేనేజర్లు ఈ రంగానికి చెందిన మేలైన కంపెనీలపై దృష్టి పెడుతున్నారు. దీంతో పాటు క్యాపిటల్‌గూడ్స్‌ రంగానికి చెందిన కంపెనీలపై సైతం ఎంఎఫ్‌లు మక్కువ చూపుతున్నాయి. మేనెల్లో ఇలా ఎంఎఫ్‌లకు మక్కువగా మారిన ఐదు కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి... 1. ఎల్‌అండ్‌టీ: మార్కెట్‌ క్యాప్‌ 2.12 లక్షల కోట్ల రూపాయలు. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఎంఎఫ్‌

ఆయిల్‌ డిమాండ్‌ అంతంతే!

Friday 14th June 2019

అంచనాలు తగ్గించిన ఐఈఏ ఈ ఏడాది ఆయిల్‌ డిమాండ్‌ పెరుగుదల తక్కువగా ఉంటుందని ఇంటర్నెషనల్‌ ఎనర్జీ ఎజెన్సీ(ఐఈఏ) శుక్రవారం అంచనా వేసింది. ప్రపంచ వాణిజ్యం అధ్వానంగా ఉండడంమే దీనికి కారణమని తెలిపింది. అయితే ఉద్ధీపన ప్యాకేజీలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వృద్ధి కారణంగా 2020లో చమురు డిమాండ్‌లో వృద్ధి ఉండొచ్చని తెలిపింది. 2019 రోజూవారీ డిమాండ్‌ పెరుగుదలను రోజుకు 12 కోట్ల బ్యారెల్‌గా అంచనా వేసింది. తాజాగా ఈ అంచనాలను 10

Most from this category