STOCKS

News


మైండ్‌ ట్రీ నికర లాభం రూ.198.4

Wednesday 17th April 2019
news_main1555498577.png-25192

ఐటీ రంగంలో సేవలు అందించే మధ్యస్థాయి కంపెనీ మైండ్‌ ట్రీ బుధవారం గత ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. క్యూ4లో  కంపెనీ నికరలాభం రూ.198.4 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే క్యూ4తో కంపెనీ ఆర్జించిన రూ.182.2 కోట్ల నికరలాభంతో పోలిస్తే ఇది 8.9శాతం అధికం. ఆదాయం సైతం 25.6 శాతం పెరిగి రూ.1,839.4 కోట్లకు చేరింది. గతేడాది క్యూ4లో ఆదాయం రూ.1,464 కోట్లుగా నమోదైంది. కంపెనీ వార్షిక ఆదాయం తొలిసారి 1బిలియన్‌ డాలర్ల మైలురాయిని అందుకోవడం పాటు, కంపెనీ స్థాపించి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు రకాలు డివిడెండ్‌ను ప్రకటించింది. షేర్‌హోల్డర్లకు  రూ.3 మధ్యంతర డివిండెండ్‌తో పాటు రూ.20 ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించింది. వార్షికంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరం(2019)లో కంపెనీ నికరలాభం 32.2 వృద్ధితో రూ.754.1 కోట్లకు,  ఆదాయం సైతం 28.5 పెరిగి రూ.7,021.5 కోట్లకు చేరింది.



You may be interested

డెల్టా కార్ప్‌... గేమింగ్‌ రారాజు

Wednesday 17th April 2019

క్యాసినో గేమింగ్‌ (లైవ్‌, ఎలక్ట్రానిక్‌, ఆన్‌లైన్‌) పరిశ్రమలో ఏకైక లిస్టెడ్‌ కంపెనీ డెల్టా కార్ప్‌. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. చక్కని నిర్వహణ పనితీరుతో ఆదాయంలో బలమైన వృద్ధి నమోదైంది. దీంతో దీర్ఘకాల దృష్టితో ఈ స్టాక్‌ కొనుగోలుకు ఇది మంచి తరుణంగా పేర్కొంటున్నాయి బ్రోకరేజీ సంస్థలు.  జనవరి-మార్చి త్రైమాసికంలో డెల్టా కార్ప్‌ ఆదాయం 19 శాతం (వార్షికంగా) పెరిగింది. క్యాసినో గేమింగ్‌ ఆదాయాల్లో వృద్ధి ఇందుకు

ఆఫ్‌షోర్‌లో బలపడిన రూపాయి

Wednesday 17th April 2019

క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో భారీగా నష్టపోయి 69.60 స్థాయికి పడిపోయిన రూపాయి బుధవారం ఆఫ్‌షోర్‌ మార్కెట్లో (విదేశాల్లో జరిగే ట్రేడింగ్‌) 25 పైసలు బలపడి రూ. 69.35 వద్దకు చేరింది. మహవీర్‌ జయంతి కారణంగా భారత్‌లో కరెన్సీ మార్కెట్లకు ఈ రోజు సెలవు దినమైనందున...గురువారం నాటి ట్రేడింగ్‌లో ఇక్కడ కూడా డాలరు మారకంలో రూపాయి విలువ పెరిగే అవకాశం వుంటుంది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో చైనా జీడీపీ విశ్లేషకుల

Most from this category