STOCKS

News


ఎన్నికల తర్వాత ఏవి బెటర్‌?

Friday 17th May 2019
Markets_main1558074963.png-25788

ఈ నెల 23న ఎన్నికల ఫలితాల అనంతరం మార్కెట్‌కు ఒక దిశా నిర్ధేశం రానుంది. ఫలితాల వేళ ఒడిదుడకులున్నా తర్వాత కాలంలో తిరిగి దేశీయ సూచీలు అప్‌మూవ్‌నే చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఫలితాల అనంతరం ఎలాంటి స్టాకులను ఎంచుకోవాలి? మిడ్‌క్యాప్స్‌ బెటరా? స్మాల్‌క్యాప్స్‌ బెటరా? అనే విషయమై రిటైల్‌ ఇన్వెస్టర్స్‌ డైలమాలో ఉన్నారు. గతేడాది గాయాల అనంతరం ఇప్పుడిప్పుడే చిన్న, మధ్యతరహా స్టాకులు కోలుకుంటున్నాయి. గతేడాది స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ సూచీల్లో పలు స్టాకులు దాదాపు 80 శాతం పతనమైన సంగతి తెలిసిందే. ఇటీవలే పతనం చవిచూసిన ఈ స్టాకుల్లో వెంటనే పెట్టుబడులు పెట్టడం ఎంతవరకు సబబని కొందరు భావిస్తున్నారు. కానీ, ఈ కరెక‌్షన్‌తో చాలా స్టాకుల వాల్యూషన్లు దిగివచ్చాయని, అందువల్ల వీటిని కొనుగోలు చేసేందుకు ఇదే తగిన తరుణమని అనలిస్టులు సూచిస్తున్నారు. ఈ స్టాకుల్లో పతనానికి లిక్విడిటీ ఇబ్బందులే కారణమని, ఎక్కువ స్టాకుల్లో సంస్థాగత మార్పుల కారణంగా పతనం రాలేదని వివరిస్తున్నారు. అందువల్ల వీటిలో బౌన్స్‌ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా లార్జ్‌క్యాప్స్‌తో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ వాల్యూషన్‌ ప్రీమియంలు దిగివచ్చాయని, అందువల్ల ఇకపై వీటిలో ర్యాలీ ఉంటుందని చెబుతున్నారు.
భారీగా పతనం
స్మాల్‌క్యాప్‌ సూచీలో 465 స్టాకులు దాదాపు 10- 80 శాత మేర క్షీణించాయి. వీటిలో జైకార్‌‍్ప, ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌, ఉషా మార్టిన్‌, బీఈఎంఎల్‌, బీజీఆర్‌ ఎనర్జీ, కార్పొరేషన్‌ బ్యాంక్‌, థర్మాక్స్‌, ఎస్కార్ట్స్‌, టీవీఎస్‌ ఎలక్ట్రానిక్స్‌, డెల్టాకార్‌‍్ప, అర్వింద్‌, జీ మీడియా, జెట్‌, హెచ్‌ఈజీ, ఆర్‌కామ్‌ తదితరాలున్నాయి. మిడ్‌క్యాప్స్‌లో 53 స్టాకులు దాదాపు 80 శాతం వరకు పతనమయ్యాయి. వీటిలో ఎంఆర్‌ఎఫ్‌, నాట్కో, అదానీ పవర్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఐడీబీఐ బ్యాంక్‌, దివాన్‌ హౌసింగ్‌, ఆర్‌ఇన్‌ఫ్రా, ఆర్‌పవర్‌ ఉన్నాయి. ఎన్నికల హడావుడి ఎలా ఉన్నా, సాధారణంగా సూచీలు పదేళ్ల కాలంలో పది శాతం చక్రీయవార్షిక వృద్ధి సాధిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఇలాంటి స్టాకుల్లో నాణ్యమైన వాటిని ఎంచుకొని దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టవచ్చని సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో చిన్న స్టాకులే మంచి ప్రదర్శన చూపుతాయని కార్వీ బ్రోకింగ్‌ అభిప్రాయపడుతోంది. ఫలితాల అనంతరం మార్కెట్లో సందిగ్ధత తొలగిపోవడం, గత పతనంతో వాల్యూషన్లు బాగా దిగిరావడమనే అంశాలు స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌కు కలిసివస్తాయని పేర్కొంది. 


 You may be interested

ఇండిగో ప్రమోటర్ల మధ్య విభేదాలు!!

Friday 17th May 2019

వ్యాపార వ్యూహాలపై భేదాభిప్రాయాలు  లీగల్‌ సంస్థల సహాయంతో పరిష్కార యత్నాలు షేరు కుదేలు.. 9 శాతం డౌన్‌ రూ. 5 వేల కోట్లు తగ్గిన మార్కెట్‌ క్యాప్‌ న్యూఢిల్లీ: ఒకదాని వెంట ఒకటిగా దేశీ విమానయాన సంస్థలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. రుణ సంక్షోభంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు నిల్చిపోగా.. తాజాగా చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో వ్యవస్థాపకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయన్న వార్తలు తెరపైకి వచ్చాయి. పనితీరు, వ్యాపార విస్తరణ వ్యూహాలపై వ్యవస్థాపకులు రాకేష్‌

11300 పాయింట్ల పైనే బుల్స్‌కు పట్టు

Friday 17th May 2019

నిఫ్టీ మరింత అప్‌మూవ్‌ చూపాలంటే 11300 పాయింట్ల పైన బలంగా క్లోజవ్వాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గురువారం ఊగిసలాట అనంతరం బుల్స్‌ సూచీలపై పట్టు చూపారు. దీంతో సూచీలు ఆరంభ నష్టాలను అధిగమించాయి. నిఫ్టీ తన 100 రోజుల డీఎంఏ స్థాయి 11250 పాయింట్ల పైన స్థిరంగా క్లోజయింది. బుల్స్‌ ఇకపై పూర్తిగా పట్టుబిగించాలంటే 11300 పాయింట్ల పైన స్థిరపడాల్సిఉంటుంది. గురువారం చమురు గ్యాస్‌, రియల్టీ, పవర్‌ సూచీలు మంచి జోరు

Most from this category