STOCKS

News


అక్టోబర్‌లో రూ.7,900 కోట్ల ‘సిప్‌’

Friday 9th November 2018
personal-finance_main1541787874.png-21832

సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) మరింత బలపడుతోంది. స్టాక్‌ మార్కెట్లలో అస్థిరతలు నెలకొన్న సమయాల్లోనూ సిప్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వస్తున్న పెట్టుబడులు ప్రతీ నెలా పెరుగుతుండడం ఇన్వెస్టర్లలో వచ్చిన మార్పును తెలియజేస్తోంది. గత నెలలో సిప్‌ రూపంలో వచ్చిన పెట్టుబడులు రూ.7,900 కోట్లకు చేరాయి. గత ఏడాది అక్టోబర్‌లో సిప్‌ ద్వారా వచ్చిన నిధులతో పోలిస్తే 42 శాతం అధికం. ఇక, ఈ ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన రూ.7,727 కోట్లతో చూసుకున్నా వృద్ధి కనిపిస్తోంది. దేశీయ స్టాక్‌ మార్కెట్లు అక్టోబర్‌ నెలలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. సెప్టెంబర్‌లో సెన్సెక్స్‌ 6.44 శాతం నష్టపోతే, అక్టోబర్‌లో 5 శాతం మేర తగ్గింది. 

 

అక్టోబర్‌లో దేశీయ మ్యూచువల్‌ పండ్స్‌లోకి నికరంగా వచ్చిన పెట్టుబడులు రూ.35,529 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు నెల సెప్టెంబర్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి రూ.2 లక్షల కోట్ల నిధులు బయటకు వెళ్లిపోయాయి. ఇక 2017 అక్టోబర్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి నికరంగా వచ్చిన నిధులు రూ.51,000 కోట్లు కావడం గమనార్హం. సెప్టెంబర్‌ నెలతో పోలిస్తే అక్టోబర్‌లో మంచి ఫలితాలు కనిపించినట్టు యాంఫి సీఈవో ఎన్‌ఎస్‌ వెంకటేశ్‌ తెలిపారు. అక్టోబర్‌లో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.15,000 కోట్లుగా ఉన్నాయి. ఈక్విటీ పథకాలు రూ.11,422 కోట్లు, ఆర్బిట్రేజ్‌ పథకాలు రూ.2,161 కోట్లు, ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలు రూ.1,200 కోట్ల మేర గత నెలలో నిధులను ఆకర్షించాయి. ఇన్‌కమ్‌ ఫండ్స్‌ నుంచి నికరంగా రూ.37,642 కోట్లు బయటకు వెళ్లిపోయాయి.

 

దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ అక్టోబర్‌ నెలలో 4 శాతం వృద్ధితో రూ.22,23,560 కోట్లకు పెరిగింది. రిటైల్‌ విభాగం ఆస్తుల విలువ వార్షికంగా చూస్తే 14 శాతం పెరిగి రూ.9,73,676 కోట్లుగా ఉంది. ఫోలియోల సంఖ్య 25 శాతం పెరిగి 790.31 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలో ఫోలియోల సంఖ్య 631.65 లక్షల కోట్లుగా ఉంది. ఒక మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలో ఓ ఇన్వెస్టర్‌కు కేటాయించే సంఖ్యను ఫోలియోగా చెబుతారు. ఫోలియోల సంఖ్య వరుసగా 53వ నెల కూడా పెరగడం గమనార్హం. సెప్టెంబర్‌ నెలతో చూసుకున్నా అక్టోబర్‌లో పెరిగిన ఫోలియోలు 11,45,000. వీటిలో 10,59,000 ఫోలియోలు రిటైల్‌ ఇన్వెస్టర్లకు చెందినవే. ‘‘గత కొన్ని నెలలుగా మార్కెట్లలో ఆటుపోట్లు ఉన్నప్పటికీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ తన బలాన్ని చాటుతోంది. రిటైల్‌ పెట్టుబడుల రాక బలంగానే ఉంది. 90 శాతం పెట్టుబడులు ఈక్విటీల్లోకి వెళుతుండగా, మిగిలిన మేర డెట్‌లోకి వెళుతున్నాయి’’ అని వెంకటేశ్‌ తెలిపారు.



You may be interested

ఆఫ్‌షోర్‌లో రూపీ దిగువకు

Saturday 10th November 2018

ఇండియన్‌ రూపాయి శుక్రవారం రాత్రి ఆఫ్‌షోర్‌ మార్కెట్‌లో బలహీనపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే దాదాపు 23 పైసలు మేర క్షీణించింది. 72.73 వద్ద ముగిసింది. ఒకానొక సమయంలో 72.91 స్థాయికి కూడా పతనమైంది. అంతర్జాతీయంగా బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు గణనీయంగా తగ్గుతుండటంతో దేశీయ కరెన్సీ కూడా కనిష్ట స్థాయిల నుంచి రికవరీ అవుతూ వస్తోంది. ఇవి రెండూ దేశ ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశాలు. మంగళవారం ముగింపుతో పోలిస్తే శుక్రవారం

బీమా, పెన్షన్‌ నిబంధనల్లో కీలక మార్పులు

Friday 9th November 2018

బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ ‘ఐఆర్‌డీఏ’ ఇటీవల పెన్షన్‌, బీమా ప్లాన్లలో పలు మార్పులను ప్రతిపాదించింది. వీటిలో కొన్ని పాలసీదారుల ప్రయోజనాల కోణంలో తీసుకొన్నవి. మరి వీటి ప్రభావం పాలసీదారులపై ఏ విధంగా ఉంటుందో నిపుణుల అభిప్రాయాల ఆధారంగా తెలుసుకుందాం...   60 శాతం నిధులు వెనక్కి కాలం ముగిసిన పెన్షన్‌ ప్లాన్ల నుంచి ఇకపై 60 శాతం నిధులను వెనక్కి తీసుకునే అవకాశం కల్పించడం ఒక ప్రతిపాదన. ప్రస్తుతం ఇది 33 శాతంగానే

Most from this category