STOCKS

News


స్టీల్‌ షేర్ల పతనం: కళ తప్పిన మెటల్‌ షేర్లు

Friday 7th December 2018
Markets_main1544175665.png-22734

స్టీల్‌ షేర్ల పతనంతో శుక్రవారం మెటల్‌ షేర్లు కళతప్పాయి. ప్రముఖ రేటింగ్‌ సం‍స్థ సిటీ దేశీ స్టీల్‌ కంపెనీలకు డౌన్‌గ్రేడ్‌ రేటింగ్‌ను కేటాయించడంతో స్టీల్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. స్టీల్‌ షేర్ల ధరలు అధిక వ్యాల్యూవేషన్స్‌ వద్ద ట్రేడ్‌ అవుతుండటం, ఆయా ఆయా కంపెనీలకు రుణ భారం పెరుగుదల,  అధిక వ్యాల్యుయేషన్స్‌ తదితర కారణాలతో గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ సిటీ తాజాగా స్టీల్‌ షేర్ల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. రానున్న రోజుల్లో స్టీల్‌ మరింత క్షీణించవచ్చనే అంచనాలతో స్టీల్‌ షేర్లను విక్రయించవచ్చని సిఫార్సు చేసింది. ఫలితంగా నేటి ట్రేడింగ్‌లో స్టీల్‌ షేర్లు భారీగా నష్టపోయి మెటల్‌ ఇండెక్స్‌ను దెబ్బతీశాయి. నేటి ట్రేడింగ్‌లో ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.50శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(3085.40)తో పోలిస్తే 0.70శాతం నష్టపోయి 3,063శాతం వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సయమానికి సూచీలోని మొత్తం 15షేర్లలో 10 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 5 షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అ‍త్యధికంగా సెయిల్‌ 4శాతం నష్టపోగా, వెల్‌స్పాన్‌ కార్పోరేషన్‌, కోల్‌ ఇండియా, జిందాల్‌ స్టీల్‌, జేస్‌ఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 3నుంచి 2శాతం క్షీణించాయి. మరోవైపు హిందూస్థాన్‌ జింక్‌ 1.50శాతం ర్యాలీ చేసింది. అపోలోఏపిల్‌ హిందాల్కో షేరు స్వల్పంగా అరశాతం లాభపడ్డాయి.



You may be interested

ఈ 5 షేర్లు రక్షణాత్మకం

Friday 7th December 2018

ముంబై: వచ్చే ఏడాది చివరి వరకు దేశీ మార్కెట్‌ పతనం దిశగానే ఉండనుండగా.. ఈకాలంలో ఒడిదుడుకులు కూడా అధిక స్థాయిలోనే ఉండేందుకు అవకాశం ఉందని నిర్మల్ బాంగ్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్, రీసెర్చ్ హెడ్ గిరీష్ పై విశ్లేషించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు రక్షణనిచ్చే షేర్లలో పెట్టుబడి చేయడం సరైన నిర్ణయమని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. పెట్టుబడి, విలువ రక్షణకు అనుగుణంగా ఉన్నటువంటి షేర్లలో

స్టీల్‌ షేర్లకు సిటీ షాక్‌

Friday 7th December 2018

గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ సిటీ తాజాగా దేశీ స్టీల్‌ కంపెనీలకు గట్టి షాకిచ్చింది. రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. స్టీల్‌ ధరలు పడిపోవడం, రుణ భారం పెరుగుదల, అధిక వ్యాల్యుయేషన్స్‌ వంటి అంశాలను ఇందుకు కారణంగా పేర్కొంది. దీంతో ఇండియన్‌ స్టీల్‌ కంపెనీలు చూడటానికి ఆకర్షణీయంగా కనిపించడం లేదని తెలిపింది.  టాటా స్టీల్‌ స్టాక్‌ను విక్రయించొచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.620 నుంచి రూ.440కి తగ్గించింది. సెయిల్‌ షేరు కూడా

Most from this category