STOCKS

News


రూ.2 వేల కోట్లతో మాస్టర్‌ కార్డ్‌ సర్వీస్‌ హబ్‌

Friday 17th May 2019
news_main1558075955.png-25793

  • పుణేలో ఏర్పాటు; అక్కడే డేటా సెంటర్‌ కూడా
  • ఐదేళ్లలో రూ.7 వేల కోట్ల పెట్టుబడుల ప్రణాళిక
  • మాస్టర్‌ కార్డ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ కుమార్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గ్లోబల్‌ కార్డ్‌ పేమెంట్స్‌ కంపెనీ మాస్టర్‌ కార్డ్‌ వచ్చే ఐదేళ్లలో ఇండియాలో రూ.7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇందులో రూ.2 వేల కోట్ల పెట్టుబడులతో పుణేలో సర్వీస్‌ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. ఇదే ప్రాంతంలో గతేడాది అక్టోబర్‌లో డేటా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసింది. ‘‘తాజా సర్వీస్‌ హబ్‌లో టోకెనైజేషన్, సైబర్‌ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్‌ సొల్యూషన్స్, డాటా విశ్లేషణ వంటి సేవలను అందిస్తాం’’ అని మాస్టర్‌ కార్డ్‌ సౌత్‌ ఏషియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెట్‌ డెవలప్‌మెంట్‌) రాజీవ్‌ కుమార్‌ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు.
డేటా సెంటర్‌...
భారత డిజిటల్‌ యూజర్ల సమాచారం భారత్‌లోనే భద్రపరచాలని ఆర్‌బీఐ మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాస్టర్‌ కార్డ్‌ రూ.2 వేల కోట్లతో పుణేలో దేశీయ లావాదేవీల ప్రాసెసింగ్‌ కేంద్రాన్ని (ఆన్‌–సాయిల్‌ ప్రాసెసింగ్‌ కేపబులిటీస్‌) ఏర్పాటు చేసింది. అమెరికా వెలుపల మాస్టర్‌ కార్డ్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం. ప్రస్తుతం ఇందులో 1500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని.. ఈ సెంటర్‌లో భారత మాస్టర్‌ కార్డ్‌ యూజర్ల డేటాను మాత్రమే భద్రపరుస్తామని, భవిష్యత్తులో విదేశీ యూజర్ల కోసం సైతం ఈ డేటా సెంటర్‌ను వినియోగించుకుంటామని రాజీవ్‌ తెలిపారు. ముంబై, పుణె, గుర్గావ్, వడోదర, బెంగళూరులోని మాస్టర్‌ కార్డ్‌ కార్యాలయాలను విస్తరించడంతో పాటూ మన దేశంలో 2 వేలుగా ఉన్న మాస్టర్‌ కార్డ్‌ ఉద్యోగులను ఐదేళ్లలో రెట్టింపు చేస్తామని తెలిపారు. కొత్త ప్రాంతాల్లో మాస్టర్‌ కార్డ్‌ సెంటర్లను ఏర్పాటు యోచనలో ఉన్నట్లు చెప్పారు.You may be interested

టీసీఎస్‌ సీఈఓ వేతనం 28% పెంపు

Friday 17th May 2019

రూ.16 కోట్లు దాటిన చెల్లింపులు న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ రాజేష్‌ గోపీనాథన్‌ వేతనం 28 శాతం పెరిగింది. ఏడాది జీతం రూ.16 కోట్లు దాటింది. రాజేష్‌ గోపీనాథన్‌కు గతేడాదిలో ఈ మొత్తాన్ని వేతనంగా చెల్లించినట్లు సంస్థ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. చెల్లింపుల వివరాల్లోకి వెళితే.. జీతం రూ.1.15 కోట్లు, అదనపు ప్రయోజనం రూ.1.26 కోట్లు, కమీషన్‌ రూ.13 కోట్లు, అలవెన్సులు రూ.60

కార్డుల్ని మించిన యూపీఐ

Friday 17th May 2019

 రూ.లక్ష కోట్ల విలువ దాటుతున్న లావాదేవీలు ఏడాది కాలంలో 4.5 రెట్లు వృద్ధి న్యూఢిల్లీ: ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ) ద్వారా లావాదేవీలు క్రమంగా పుంజుకుంటున్నాయి. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో నెలవారీ లావాదేవీల సంఖ్య 4.5 రెట్లు పెరిగి.. 79.95 కోట్ల స్థాయికి చేరింది. ఈ క్రమంలో క్రెడిట్, డెబిట్‌ కార్డు లావాదేవీలను కూడా మించి యూపీఐ చెల్లింపులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో యూపీఐ

Most from this category