STOCKS

News


మారుతీ కార్లలో లిథియమ్‌ బ్యాటరీలు!!

Friday 13th July 2018
auto-mobiles_main1531503091.png-18298

న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌ కంపెనీ తన వాహనాల్లో లిథియమ్‌-అయాన్‌ బ్యాటరీలను అమర్చాలని భావిస్తోంది. మరీ ముఖ్యంగా తన భారత్‌ విభాగమైన మారుతీ సుజుకీ ఇండియా విక్రయించే ప్రీమియం కార్లలో వీటిని అమర్చాలని చూస్తోంది. హ్యాచ్‌బ్యాక్‌ కారు స్విఫ్ట్‌, దీని కన్నా ఖరీదైన మోడళ్లలో సాం‍ప్రదాయిక లెడ్‌ బ్యాటరీల స్థానంలో దీర్ఘకాలం పనిచేసే లిథియమ్‌-అయాన్‌ బ్యాటరీలను తీసుకురావడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లిథియమ్‌-అయాన్‌ బ్యాటరీల వల్ల వ్యయం తగ్గుతుందని కంపెనీ అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా తొషిబా, డెన్సో కంపెనీల భాగస్వామ్యంతో సుజుకీ రూ.1,152 కోట్లతో గుజరాత్‌లో బ్యాటరీ తయారీ ప్లాంటు ఏర్పాటు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో తయారయ్యే బ్యాటరీలను కేవలం కార్లలోనే కాకుండా సుజుకీ మోటార్‌ మార్కెట్‌లోకి తీసుకురానున్న ఎలక్ట్రిక్‌ టూవీలర్లలోనూ ఉపయోగిస్తారు. కంపెనీ 2020 కల్లా ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ను తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.    

 


 



You may be interested

అమెరికన్ సంస్థలతో స్పైస్‌జెట్ జట్టు

Friday 13th July 2018

 వాషింగ్టన్:  కార్యకలాపాల విస్తరణలో భాగంగా రెండు అమెరికన్ సంస్థలతో భారీ వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. ఆయా కంపెనీల పేర్లు వెల్లడించనప్పటికీ.. ఇందులో ఒకటి పెద్ద అంతర్జాతీయ విమానయాన సంస్థ కాగా, మరొకటి దిగ్గజ అమెరికన్ సంస్థని పేర్కొన్నారు. ఏవియేషన్ వ్యాపారం అధిక రిస్కుతో కూడుకున్నది కావడంతో ఇతరత్రా అనుబంధ వ్యాపార విభాగాలవైపు కూడా

ఆసియా కుబేరుడు ముకేశ్‌ అంబానీ

Friday 13th July 2018

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మరో ఘనత సాధించారు. అలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మాను వెనక్కునెట్టి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ ధర శుక్రవారం 1.6 శాతం పెరిగి రూ.1,099.80 ఆల్‌టైమ్‌ హై స్థాయికి చేరింది. దీంతో అంబానీ సంపద 44.3 బిలియన్‌ డాలర్లకు పెరిగి ఉంటుందని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ పేర్కొంది. జాక్‌ మా సంపద విలువ 44 బిలియన్‌

Most from this category